న‌య‌న‌తార రోల్ గురించి క్లారిటి ఇచ్చిన మురుగుదాస్..!

  • IndiaGlitz, [Friday,September 16 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. తెలుగు, త‌మిళ్ లో ఈ చిత్రం దాదాపు 100 కోట్ల‌తో రూపొందుతుంది. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే...ఈ చిత్రంలో అందాల తార న‌య‌న‌తార ఓ ముఖ్య పాత్ర పోషించ‌నుంది అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ వార్త‌ల పై డైరెక్ట‌ర్ మురుగుదాస్ స్పందిస్తూ...మ‌హేష్ సార్ తో చేస్తున్న సినిమాలో హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక్క‌రే. సెకండ్ హీరోయిన్ లేదు అంటూ ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటి ఇచ్చేసారు మురుగుదాస్..! ప్ర‌స్తుతం మ‌హేష్ పై చెన్నైలో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. జ‌న‌వ‌రికి మొత్తం షూటింగ్ పూర్తి చేసి స‌మ్మ‌ర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

రేపే వెంకీ గురు ఫ‌స్ట్ లుక్ రిలీజ్..!

విక్ట‌రీ వెంక‌టేష్ బాలీవుడ్ మూవీ సాలా ఖ‌ద్దూస్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సుధా కొంగ‌ర తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ బాక్సింగ్ కోచ్ గా న‌టిస్తున్నారు.

4 ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈడు గోల్డ్ ఎహే ఆడియో రిలీజ్..!

డాన్సింగ్‌ స్టార్‌ సునీల్‌, బిందాస్‌, రగడ, దూసుకెళ్తా  చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఈడు గోల్డ్ ఎహే.ఎ టివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ద‌స‌రా రేసులో జాగ్వార్

మాజీ ప్ర‌ధాని దేవ‌గౌడ మ‌న‌వ‌డు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్ ని  హీరోగా ప‌రిచ‌యం చేస్తూ రూపొందిస్తున్నభారీ  చిత్రం జాగ్వార్. ఈ చిత్రాన్ని చెన్నాంబిక ఫిలింస్ బ్యాన‌ర్ పై శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్నారు.

నిప్పురా..! లో న‌టిస్తున్న‌ ర‌జ‌నీ..!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన లేటెస్ట్ సెన్సేష‌న్ క‌బాలి. ఈ చిత్రంలో నిప్పు రా...! అనే సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో తెలిసిందే. త‌మిళ్ లో నెరుప్పు డా అంటే తెలుగులో నిప్పురా అని అర్ధం. ఇప్పుడు నెరుప్పుడా అనే టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతుంది.

'ఇజం' రిలీజ్ డేట్ మారనుందా?

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ఇజం`. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.