నయనతార రోల్ గురించి క్లారిటి ఇచ్చిన మురుగుదాస్..!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ - క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తెలుగు, తమిళ్ లో ఈ చిత్రం దాదాపు 100 కోట్లతో రూపొందుతుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే...ఈ చిత్రంలో అందాల తార నయనతార ఓ ముఖ్య పాత్ర పోషించనుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తల పై డైరెక్టర్ మురుగుదాస్ స్పందిస్తూ...మహేష్ సార్ తో చేస్తున్న సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కరే. సెకండ్ హీరోయిన్ లేదు అంటూ ట్విట్టర్ ద్వారా క్లారిటి ఇచ్చేసారు మురుగుదాస్..! ప్రస్తుతం మహేష్ పై చెన్నైలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. జనవరికి మొత్తం షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com