Oh Thandri Theerpu: 'ఓ తండ్రి తీర్పు' పోస్టర్ ఆవిష్కరించిన నిర్మాత నటులు మురళీమోహన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణ లో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మిస్తున్న ఓ తండ్రి తీర్పు చిత్రం పోస్టర్ ఫస్ట్ లుక్ ప్రముఖ నటుడు నిర్మాత మురళీమోహన్ ఆవిష్కరించారు.రాజేందర్ రాజు కాంచనపల్లి పర్యవేక్షణలో ప్రతాప్ భీమవరపు దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఓ తండ్రి తీర్పు చలన చిత్రం పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం
మురళీమోహన్ మాట్లాడుతూ... " 1985 వ సంవత్సరం జయభేరి బ్యానర్లో నేను కథానాయకుడుగా నిర్మించిన ఓ తండ్రి తీర్పు ఘన విజయం సాధించింది. నంది అవార్డు కూడా వచ్చింది. అది నా సినీ జీవితంలో ఒక మైలు రాయి.ఇప్పుడు 37 సంవత్సరాల తర్వాత మళ్లీ అదే టైటిల్ తో వస్తున్న ఓ తండ్రి తీర్పు కూడా ఘన విజయం సాధించి అవార్డ్స్ అందుకుంటుంది.ఏ వి కె ఫిలిమ్స్ ఆరిగపూడి విజయకుమార్ గారికి, నిర్మాత లయన్ శ్రీరామ్ దత్తి గారికి, దర్శకులు ప్రతాప్ భీమవరపు గారికి, చిత్ర పర్యవేక్షకులు రాజేంద్ర రాజు కాంచనపల్లి గారికి, డిఓపి సురేష్ చెట్టిపల్లి గారికి ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ .పబ్లిసిటీ డిజైనర్ వివా రెడ్డి చేసిన పోస్టర్ డిజైన్ అద్భుతంగా ఉంది "అని అన్నారు.
నిర్మాత శ్రీరామ్ దత్తి మాట్లాడుతూ..." మురళి మోహన్ గారు సక్సెస్ ఫుల్ నిర్మాత. వారి చేతుల మీదుగా మా సినిమా పోస్టర్ ఆవిష్కరించబడటం మా అదృష్టం. నిర్మాతగా ఇది నాకు శుభ సూచకం . మురళీమోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.రచయిత దర్శకులు ప్రతాప్ భీమవరపు గారు తండ్రిగా ప్రధాన పాత్రలో నటిస్తూ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.ప్రేక్షకుల ఆదరణతో లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ గారి ఆశీస్సులతో మంచి నిర్మాతగా మంచి సినిమాలు నిర్మించాలన్నది నా ఆశయం.నా ఆశయ సాధనలో పాలుపంచుకుంటున్న రాజేంద్ర రాజు కాంచనపల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే .అప్పగించిన పని బాధ్యతగా పోటీ చేయటం మా రారాజు గొప్పతనం "అని అన్నారు.పబ్లిసిటీ డిజైనర్ వివా రెడ్డి చేసిన పోస్టర్ డిజైన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అతనిలో మంచి డిజైనరే కాదు నటుడు కూడా ఉన్నాడు. ఓ తండ్రి తీర్పు చిత్రంలో వివా రెడ్డి ఒక హీరో గా నటించడం ఒక విశేషం "
అని అన్నారు.
రచయిత దర్శకులు ప్రతాప్ భీమవరపు మాట్లాడుతూ..." ఈరోజు నా జీవితంలో మర్చిపోలేను. మద్రాస్ లో నా సినీ జీవితం ప్రారంభం నుంచి మురళీమోహన్ గారు నాకు ఇష్టమైన వ్యక్తి. మాదాల రంగారావు గారి విప్లవ శంఖం సినిమాకు వారితోకలిసి పని చేసాను .హీరోగా నిర్మాతగా వారు సాధించిన విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి. 37 సంవత్సరాల క్రితం విడుదలైన వారి ఓ తండ్రి తీర్పు చిత్రం నాకు చాలా ఇష్టం. అందుకే అదే టైటిల్ తో ఒక కథ రాసుకొని సినిమాగా తీస్తున్నాను.వారి బ్యానర్ లో వారే హీరోగా నటించి ఘన విజయం సాధించిన ఓ తండ్రి తీర్పు సినిమాలాగే మా సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుంది అనడానికి వారి చేతుల మీదుగా పోస్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ కావడం నిదర్శనం.అయ్యప్ప స్వామి మాల ధారణలో మా సినిమా పోస్టర్ ఆవిష్కరించి ఆశీర్వదించినందుకు మురళీమోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.అలాగే చిత్రానికి అన్ని తానై ముందు ఉండి నడిపిస్తున్న రాజేందర్ రాజు కాంచనపల్లి కి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. "అని అన్నారు.
పబ్లిసిటీ డిజైనర్ వివా రెడ్డి మాట్లాడుతూ..." జీవితంలో గుర్తుండిపోయే ఒక మంచి సినిమాకు అవకాశం ఇచ్చిన కాంచనపల్లి రాజేందర్ రాజు అన్నయ్యకి హృదయపూర్వక కృతజ్ఞతలు.సుమారు 600కు పైగా సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేశాను. సీరియల్స్ లో సినిమాల్లో నటిస్తున్నాను.కానీ నా కెరీర్ లో ఓ తండ్రి తీర్పు లాంటి గొప్ప సినిమాకి డిజైనర్ గా పనిచేయడం, ప్రధాన పాత్రలో నటించడం కేవలం రాజేందర్ రాజు అన్నయ్య వల్ల నే సాధ్యమైంది.డిజైనర్ గా, నటుడిగా ఈ సినిమా నాకు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది.ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత శ్రీరామ్ దత్తి గారికి, దర్శకుడు ప్రతాప్ భీమవరపు గారికి రుణపడి ఉంటాను.
పోస్టర్ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించి, ఆశీర్వదించిన మురళీమోహన్ గారికి కృతజ్ఞతలు. " అని అన్నారు. పర్యవేక్షకులు కాంచనపల్లి రాజేంద్ర రాజు మాట్లాడుతూ..." దైవాంశ సంభూతులు ప్రముఖ నిర్మాత దర్శకులు మురళీమోహన్ గారు ఓ తండ్రి తీర్పు పోస్టర్ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించడం సాక్షాత్తు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను.ఎంతో మంచి మనసుతో ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరిని పలకరించి ఆశీర్వదించడం వారి గొప్ప మనసుకు నిదర్శనం. నటుడిగా నిర్మాతగా వ్యాపారవేత్తగా మా తరానికి మురళీమోహన్ లాంటి వ్యక్తి ఒక స్ఫూర్తి."అని అన్నారు.
ప్రతాప్, శ్రీరామ్, రాజేంద్ర కుమార్, వివా రెడ్డి, కునాల్,కుషాల్, చిత్రం భాష,అనురాధ,రారాజు, సురభి శ్రావణి, పునర్వి, శివాజీ, రమ్యకృష్ణ, మంజుల, స్వాతి, జ్యోతి, కేవీఎల్ నరసింహారావు, లక్ష్మీనారాయణ,పేరిణి శ్రీకాంత్ ,గుండు బ్రదర్స్, జబర్దస్త్ నాగరాజు,మిమిక్రీ రాజు,రాము,అయ్యప్ప,ప్రమీల,అమృత వర్షిణి, సాయి చరణ్, సాయి తేజ తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments