మున్నాభాయ్ కు గాయాలు

  • IndiaGlitz, [Tuesday,March 21 2017]

బాలీవుడ్ మున్నాభాయ్ సంజ‌య్‌ద‌త్‌కు సినిమా షూటింగ్‌లో గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకెళ్తే..ప్ర‌స్తుతం సంజ‌య్‌ద‌త్ భూమి అనే సినిమాలో న‌టిస్తున్నాడు. చంబ‌ల్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌లో యాక్ష‌న్ సీక్వెన్స్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో సంజ‌య్‌ద‌త్ కింద్ర‌ప‌డ‌టంతో ప‌క్క టెముక‌లు విరిగాయి.
కానీ ఈ గాయం విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. పెయిన్ కిల్ల‌ర్స్ వేసుకుని షూటింగ్‌లో పాల్గొన్నాడు. అయితే నొప్పి తీవ్ర‌త‌రం కావ‌డంతో హాస్పిట‌ల్‌కు వెళ్ళ‌డంతో డాక్ట‌ర్స్ కొన్ని రోజులు పాటు రెస్ట్ అవ‌స‌ర‌మ‌ని సూచించార‌ట‌.