మున్సిపల్ సిబ్బంది నిర్వాకం.. పన్ను చెల్లించలేదని, ఇంటి ముందు చెత్త కుప్ప
Send us your feedback to audioarticles@vaarta.com
ఇంటిపన్ను, నీటి పన్ను వంటి వాటిని వెంటనే చెల్లించాలంటూ నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు మైకుల ద్వారా అనౌన్స్ చేస్తుంటాయి. అంతేకాదు.. భారీగా బకాయిలు వున్న వారికి ఆఫర్లు ప్రకటిస్తూ పన్నులు రాబట్టేందుకు ప్రయత్నిస్తూ వుంటాయి. అయితే ఇంటి పన్ను చెల్లించలేదంటూ ఏకంగా ఓ ఇంటి ముందు మున్సిపాలిటీ అధికారులు చెత్త పోశారు. జగిత్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పట్టణంలోని పురాణిపేటకు చెందిన హైమద్ బిన్ సాలెం ఇంటి మీద రూ. 54వేల ఆస్తిపన్ను బకాయిలు వున్నాయి. గడిచిన ఐదేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి మొత్తం రూ.1.04 లక్షలు చెల్లించాల్సిందిగా పురపాలక అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. వారింట్లో ఇటీవల ఇద్దరు మృతి చెందడం, స్థానికంగా ఎక్కువగా ఉండకపోవడంతో చెల్లింపులో జాప్యం జరిగింది. ఈ క్రమంలో గురువారం పన్ను చెల్లించాలని పురపాలక సిబ్బంది కోరగా ఉన్నపళంగా అంత మొత్తం చెల్లించలేమని, ప్రస్తుతానికి రూ.25 వేలు చెల్లిస్తామని హైమద్ బిన్ సాలెం చెప్పారు.
దీనికి అధికారులు అంగీకరించకపోగా.. బకాయి పూర్తిగా చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. అక్కడితో ఆగకుండా ట్రాక్టర్‌లో చెత్త తెప్పించి ఇంటిముందు కుప్పగా పోశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైమద్.. మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న అధికారులు వచ్చి సర్దిచెప్పడంతో చెత్తను పురపాలక సిబ్బంది తొలగించారు. ఈ సంఘటన స్థానికంగా వైరల్ కావడంతో.. పురపాలక కమిషనర్ జె.స్వరూపారాణి సంబంధిత సిబ్బందికి మెమో జారీ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com