మున్సిపల్ సిబ్బంది నిర్వాకం.. పన్ను చెల్లించలేదని, ఇంటి ముందు చెత్త కుప్ప

  • IndiaGlitz, [Friday,March 25 2022]

ఇంటిపన్ను, నీటి పన్ను వంటి వాటిని వెంటనే చెల్లించాలంటూ నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు మైకుల ద్వారా అనౌన్స్‌ చేస్తుంటాయి. అంతేకాదు.. భారీగా బకాయిలు వున్న వారికి ఆఫర్లు ప్రకటిస్తూ పన్నులు రాబట్టేందుకు ప్రయత్నిస్తూ వుంటాయి. అయితే ఇంటి పన్ను చెల్లించలేదంటూ ఏకంగా ఓ ఇంటి ముందు మున్సిపాలిటీ అధికారులు చెత్త పోశారు. జగిత్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పట్టణంలోని పురాణిపేటకు చెందిన హైమద్ బిన్ సాలెం ఇంటి మీద రూ. 54వేల ఆస్తిపన్ను బకాయిలు వున్నాయి. గడిచిన ఐదేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి మొత్తం రూ.1.04 లక్షలు చెల్లించాల్సిందిగా పురపాలక అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. వారింట్లో ఇటీవల ఇద్దరు మృతి చెందడం, స్థానికంగా ఎక్కువగా ఉండకపోవడంతో చెల్లింపులో జాప్యం జరిగింది. ఈ క్రమంలో గురువారం పన్ను చెల్లించాలని పురపాలక సిబ్బంది కోరగా ఉన్నపళంగా అంత మొత్తం చెల్లించలేమని, ప్రస్తుతానికి రూ.25 వేలు చెల్లిస్తామని హైమద్ బిన్ సాలెం చెప్పారు.

దీనికి అధికారులు అంగీకరించకపోగా.. బకాయి పూర్తిగా చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. అక్కడితో ఆగకుండా ట్రాక్టర్‌లో చెత్త తెప్పించి ఇంటిముందు కుప్పగా పోశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైమద్.. మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న అధికారులు వచ్చి సర్దిచెప్పడంతో చెత్తను పురపాలక సిబ్బంది తొలగించారు. ఈ సంఘటన స్థానికంగా వైరల్ కావడంతో.. పురపాలక కమిషనర్ జె.స్వరూపారాణి సంబంధిత సిబ్బందికి మెమో జారీ చేశారు.

More News

హైదరాబాదీలకు బ్యాడ్ న్యూస్... ఇరానీ ఛాయ్ ధరల పెంపు, కప్పు ఎంతో తెలుసా..?

ఇరానీ చాయ్... హైదరాబాద్‌కు ఎవరొచ్చినా బిర్యానీ తర్వాత ఖచ్చితంగా టేస్ట్ చేసేది దీనినే.

ఆర్ఆర్ఆర్ థియేటర్‌లో విషాదం.. సినిమా చూస్తూ గుండెపోటుతో అభిమాని మృతి

టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన చిత్రం ‘‘ఆర్ఆర్ఆర్’’.

నేపాల్‌లో భారతీయ పేమెంట్స్ సిస్టమ్.. ప్రారంభమైన ‘యూపీఐ’ సేవలు

నోట్ట రద్దు సమయంలో మనదేశంలో అందుబాటులోకి వచ్చిన యునిఫైట్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే.

మెగా- నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్.. హైదరాబాద్‌లో ఈ ఐదు థియేటర్లలో ‘‘ఆర్ఆర్ఆర్’’ స్పెషల్ షో, ఉ.7కి ముందే

తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ‘‘ఆర్ఆర్ఆర్’’ మరికొద్దిగంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

రెండ్రోజుల్లో ఐపీఎల్ ... ధోనీ సంచలనం , చెన్నై కెప్టెన్‌గా తప్పుకున్న మహీ

ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌‌కి షాక్ తగిలింది. జట్టును పలు మార్లు విజేతగా నిలిపిన మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.