బన్నీ కోసం ముంబై టీమ్
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు అర్జున్ బిరుదు స్టైలిష్ స్టార్.. ప్రతి సినిమా లుక్ పరంగా బన్నీ చాలా కేర్ తీసుకుంటూ ఉంటాడు. ఇటీవల విడుదలైన `అల వైకుంఠపురములో`లో బన్నీ సరికొత్త లుక్‌లో కనపడి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. బన్నీ ఇప్పుడు తన 20వ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను వెర్సటైల్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. బన్నీ ఈ సినిమా కోసం రగ్డ్ లుక్‌లో కనపడుతున్నాడు. గడ్డం కూడా పెంచేశాడు. అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనపడటానికి ముంబై నుండి టీమ్ రాబోతున్నారు. బన్నీపై స్పెషల్ ఫొటో షూట్‌ను నిర్వహించి లుక్‌ను ఖరారు చేయబోతున్నారట.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ చిత్రానికి శేషాచలం అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హృరోయిన్గా నటించనుంది. అనసూయ కీలక పాత్రలో నటించనుంది. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న సినిమానే కాదు.. రంగస్థలం వంటి భారీ హిట్ తర్వాత సుకుమార్ తెరకెక్కించబోతున్న చిత్రం కూడా ఇదే కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments