తాప్సీకి జరిమానా విధించిన ముంబై పోలీసులు..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఝుమ్మందినాదం సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లో కెరీర్‌ను స్టార్ట్ చేసిన తాప్సీకి అనుకున్నట్లు ప్రారంభస్థాయిలో సక్సెస్‌లు దక్కలేదు. ఐరన్‌లెగ్ భామగా పేరు సంపాదించుకుంది. అదే సమయంలో ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం నామ్ షబానా మంచి హిట్ సాధించడంతో తాప్సీ బ్రేక్ సంపాదించుకుంది. అక్కడ నుండి అటు బాలీవుడ్లో ఇటు టాలీవుడ్లో తాప్సీ వరుస విజయాలు సాధించింది. ఇప్పుడు ఇటు దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా తాప్సీ సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణిస్తుంది. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉంది. రీసెంట్‌గానే 'రష్మీ రాకెట్' సినిమా స్టార్ట్ చేసింది.
ఈ సినిమా షూటింగ్లో ఉన్న తాప్సీకి పోలీసులు జరిమానా విధించారు. అందుకు కారణం ఆమె బైక్ నడపటమే. బైక్ నడిపితే జరిమానా వేస్తారా! అని అనుకోకండి. అసలు విషయమేమంటే.. బైక్ నడిపిన తాప్సీ హెల్మెట్ వేసుకోకుండా ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టింది. అందుకు పోలీసులు తాప్సీకి ఫైన్ విధించారు. ఈ విషయాన్ని తాప్సీనే చెప్పింది. అంతే కాకుండా హెల్మెట్ లేకుండా బైక్ నడపకండి అంటూ అభిమానులకు సలహాను ఇస్తూ..తాను హెల్మెట్ లేకుండా బండి నడిపిన ఫొటోను షేర్ చేసింది సొట్టబుగ్గల తాప్సీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com