టీఆర్పీ స్కాంలో రిపబ్లిక్ టీవీ
Send us your feedback to audioarticles@vaarta.com
ముంబైలో టెలివిజన్ రేటింగ్ పాయింట్ల(టీఆర్పీ) స్కాంను పోలీసులు బట్టబయలు చేశారు. టీవీ రేటింగ్లను నిర్ణయించే బార్క్ (బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రిసెర్చ్ కౌన్సిల్) తరఫున మీటర్ల మానిటరింగ్ కాంట్రాక్ట్ తీసుకున్న హంస అనే ఏజెన్సీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇంగ్లీష్ న్యూస్ చానెల్ రిపబ్లిక్ సహా మరో రెండు మరాఠీ చానెళ్లు ఈ స్కాంను చేసినట్టు వెల్లడించారు. రిపబ్లిక్ చానెల్‌కు సుప్రసిద్ధ జర్నలిస్టు, న్యూస్ ప్రజెంటర్ అయిన అర్నబ్ గోస్వామి చీఫ్ ఎడిటర్‌గా ఉన్నారు.
అయితే రిపబ్లిక్ చానెల్‌కు సంబంధించిన వారినెవ్వరినీ పోలీసులు అరెస్ట్ చేయలేదు కానీ మరాఠీ చానెళ్ల సీనియర్ అధికారులను మాత్రం అరెస్ట్ చేశారు. ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. హంస ఏజెన్సీలో పని చేసి మానేసిన సిబ్బందిని సైతం ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. రిపబ్లిక్‌తో పాటు మరో రెండు మరాఠీ చానెళ్లు ముంబై నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజల ఇళ్లల్లో బార్క్ నెలకొల్పిన బేరోమీటర్లను టాంపరింగ్ చేయడానికి ప్రయత్నించినట్లు స్పష్టమైందన్నారు.
రిపబ్లిక్ టీవీతో పాటు మరాటీ చానెళ్లు వివిధ ప్రాంతాల్లోని ప్రజలకు కొంత డబ్బు ముట్టజెప్పి.. వారు తమ చానెల్‌ను నిరంతరం ఆన్ చేసి ఉంచేలా ఒప్పందం కుదుర్చుకున్నాయని సీపీ పరమ్‌వీర్ తెలిపారు. ఈ ఆరోపణలను అర్నబ్ గోస్వామి కొట్టిపడేశారు. రిపబ్లిక్ టీవీని చానెల్‌ను మహారాష్ట్రం ప్రభుత్వం బ్లేమ్ చేసేందుకు యత్నిస్తోందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments