సోనూసూద్ నేరాలకు అలవాటు పడిన వ్యక్తి: ముంబై నగర పాలక సంస్థ

  • IndiaGlitz, [Wednesday,January 13 2021]

ముంబై నగర పాలక సంస్థ ప్రముఖ నటుడు సోనూ సూద్‌‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనూను నేరాలకు అలవాటు పడ్డ వ్యక్తిగా అభివర్ణించారు. ముంబైలోని జుహూ నివాసిత ప్రాంతంలో గతంలో అనధికార కట్టడాలను నగర పాలక సంస్థ రెండు సార్లు కూల్చివేసినా ఆయన తన పద్ధతి మార్చుకోలేదని పేర్కొంది. సోనూసూద్‌ ఇటీవల హైకోర్టులో వేసిన అప్పీలు వ్యాజ్యానికి సమాధానంగా నగర పాలక సంస్థ మంగళవారం ఒక అఫిడవిట్‌ దాఖలు చేసింది. సోనూ తన నివాసంలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపిస్తూ నగర పాలక సంస్థ ఇచ్చిన నోటీసులను ఆయన కోర్టులో సవాలు చేశారు. దీన్ని సివిల్‌ కోర్టు తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

కాగా.. కొద్ది రోజుల క్రితం బృహన్ ముంబై(బీఎంసీ) మునిసిపల్ కార్పొరేషన్ సోనూసూద్‌కు నోటీసులు ఇచ్చింది. ముంబైలోని జుహూ ప్రాంతంలో అనధికార నిర్మాణాలకు సోనూ పాల్పడ్డారని.. ఇదంతా అనుమతి లేకుండానే జరిగిందని పేర్కొంది. ఈ నోటీసుపై సోనూసూద్ ముంబై హైకోర్టును సంప్రదించారు. దీనిపై సోనూ తరుఫు న్యాయవాది డీపీ సింగ్.. గత నెల ఫైల్ చేసిన పిటిషన్‌లో ఆరు అంతస్థుల శక్తి సాగర్ బిల్డింగ్‌లో ఎటువంటి అక్రమ నిర్మాణం జరగలేదని పేర్కొన్నారు. కేవలం ఆ మార్పులు మహారాష్ట్ర రీజనల్, టౌన్ ప్లానింగ్ (ఎమ్మార్టీపీ) చట్ట ప్రకారమే జరిగాయని సోనూ తరపు న్యాయవాది స్పష్టం చేశారు.


ఆ వెంటనే సోనూసూద్ సివిల్ కోర్టును సంప్రదించి ఊరట ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే సివిల్ కోర్టు తిరస్కరించడంతో ఆ తర్వాత హైకోర్టులో అప్పీల్ చేశారు. జనవరి 4న బీఎంసీ.. జుహూ పోలీస్ స్టేషన్‌లో సోనూసూద్‌కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించింది. అనుమతి లేకుండా రెసిడెన్షియల్ బిల్డింగ్‌ను హోటల్‌గా మార్చారని బీఎంసీ ఫిర్యాదు చేసింది. తాజాగా సోనూపై చేసిన సంచలన వ్యాఖ్యలకు ఆయన స్పందించాల్సి ఉంది. లాక్‌డౌన్‌లో అడిగిన వారికి లేదనకుండా సోనూ సాయమందించారు. సోనూసూద్ నుంచి సాయం పొందిన చాలా మంది ఆయనను దేవుడిలా కొలుస్తున్నారు. అలాంటి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

More News

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సూర్య భగవానుడిని మనం ప్రత్యక్ష దైవంగా కొలుస్తామని..

మేము చదవం.. వినం..: స్పష్టం చేసిన వాట్సాప్

ప్రఖ్యాత మెసేజింగ్ యాప్ తన వినియోగదారులకు వివరణల మీద వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తోంది.

నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీం స్టే...

నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

తెలుగు రాష్ట్రాలకు చేరుకున్న కరోనా వ్యాక్సిన్..

కరోనా వ్యాక్సిన్ తెలుగు రాష్ట్రాలకు చేరుకుంది. దేశ వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్న విషయం తెలిసిందే.

'అల‌వైకుంఠ‌పురంలో' వ‌న్ ఇయ‌ర్ రీయూనియ‌న్ ఈవెంట్

అల వైకుంఠపురంలో చిత్రం 2020, జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది.