ముంబాయి కంపెనీతో చేతులు కలిపిన రానా..!
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి సినిమాతో రానా ఇమేజే మారిపోయింది. ఒక్కసారిగా జాతీయ స్ధాయిలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఓ వైపు బాహుబలి 2 సినిమా చేస్తునే మరో వైపు ఘాజీ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే... అడ్వర్ టైజ్ మెంట్స్, బ్రాండ్స్, మీడియా కార్పోరేషన్స్, మార్కెటింగ్ సొల్యూషన్స్ ఇలా స్టార్స్ కు సంబంధించిన ప్రమోషన్స్ అన్నింటిని చూసుకునే ముంబాయి కంపెనీ క్వాన్. ఈ సంస్థతో రానా చేతులు కలిపాడు. ఈ సంస్థ కేవలం సినిమా స్టార్స్ ప్రమోషన్స్ మాత్రమే కాకుండా స్పోర్ట్స్, మ్యూజిక్ తదితర రంగాలకు సంబంధించిన ప్రమోషన్స్ ను కూడా చేస్తుంటుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మార్కెటింగ్ వ్యవహరాలను ఈ సంస్థే చూస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీతో కలిసి రానా హైదరాబాద్ లో ఈ సంస్థను ఏర్పాటు చేస్తుండడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com