జూన్ 30న మల్టీస్టారర్ 'శమంతకమణి'
Send us your feedback to audioarticles@vaarta.com
నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్ కిషన్, ఆది హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం `శమంతకమణి` షూటింగ్ పూర్తయింది. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.
చిత్ర నిర్మాత వి.ఆనందప్రసాద్ మాట్లాడుతూ ```భలే మంచి రోజు` ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీస్టారర్‌గా `శమంతకమణి` ని తెరకెక్కిస్తున్నాం. నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్ కిషన్, ఆది చాలా చక్కగా నటించారు. ప్రతి ఒక్కరికీ ప్రామినెంట్ రోల్ ఉంటుంది. వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకుని శ్రీరామ్ కథను చిక్కగా అల్లుకున్నారు. ఓ వైపు వినోదాన్ని పంచుతూనే మరో వైపు ఉత్కంఠ రేకెత్తిస్తుంది. థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. షూటింగ్ పూర్తి చేశాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూన్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ `` యువ కథానాయకులు నలుగురితో మల్టీస్టారర్ అనగానే ప్రాజెక్ట్ కు క్రేజ్ వచ్చింది. భవ్య క్రియేషన్స్ ఆనందప్రసాద్‌గారు కథ వినగానే సినిమా చేయడానికి ముందుకొచ్చారు. ఇందులో ప్రతి ఒక్కరి పాత్రా జనాలకు కనెక్ట్ అవుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ విత్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమా చేశాం. యూత్‌తో పాటు అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది`` అని తెలిపారు.
డా.రాజేంద్రప్రసాద్, చాందినీ చౌదరి, జెన్నీ హనీ, అనన్యా, సోనీ, ఇంద్రజ, కస్తూరి, సుమన్, తనికెళ్ల భరణి, హేమ, సురేఖావాణి, `సత్యం` రాజేశ్, బెనర్జీ, `అదుర్స్` రఘు తదితరులు ఇతర పాత్రధారుల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, కెమెరా: సమీర్ రెడ్డి, ఆర్ట్: వివేక్ అన్నామలై, ఎడిటింగ్: ప‌్రవీణ్ పూడి, నిర్మాత: వి.ఆనందప్రసాద్, కథ - స్క్రీన్‌ప్లే - మాటలు - దర్శకత్వం: శ‌్రీరామ్ ఆదిత్య.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments