మూడోసారి కూడా మల్టీస్టారరే...
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున, నాని కాంబినేషన్లో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఆ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేస్తాడని కూడా ఫిలింనగర్లో గుసగుసలు వినిపించాయి. అయితే అప్పట్లో అలాంటిదేమీ లేదని తేల్చేశారు. తాజా సమాచారం ప్రకారం నాగార్జున, నాని కాంబినేషన్లో సినిమా ఉంటుందని అంటున్నారు.
అయితే ఈ సినిమాను శ్రీరాం ఆదిత్య డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు. రీసెంట్గా నాగార్జునను కలిసిన శ్రీరాం ఆదిత్య కాన్సెప్ట్ చెప్పాడట. నాగ్‌కు బాగా నచ్చేసిందట. ఇందులో నాని కూడా నటిస్తాడు. సీనియర్ నిర్మాత అశ్వనీదత్ సినిమాను నిర్మిస్తున్నాడు. నాగార్జున రాజుగారి గది2 సినిమా విడుదలైన తర్వాతే ఈ సినిమాను సెట్స్‌లోకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తారట.
భలేమంచిరోజు సినిమా తర్వాత శ్రీరాం ఆదిత్య తెరకెక్కించిన శమంతక మణి చిత్రం కూడా మల్టీస్టారరే. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి శ్రీరాం ఆదిత్య చేయబోయే సినిమా కూడా మల్టీస్టారర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments