మూడోసారి కూడా మల్టీస్టార‌రే...

  • IndiaGlitz, [Monday,September 11 2017]

నాగార్జున‌, నాని కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేస్తాడ‌ని కూడా ఫిలింన‌గ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపించాయి. అయితే అప్ప‌ట్లో అలాంటిదేమీ లేద‌ని తేల్చేశారు. తాజా స‌మాచారం ప్రకారం నాగార్జున‌, నాని కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌ని అంటున్నారు.

అయితే ఈ సినిమాను శ్రీరాం ఆదిత్య డైరెక్ట్ చేస్తాడ‌ని అంటున్నారు. రీసెంట్‌గా నాగార్జున‌ను క‌లిసిన శ్రీరాం ఆదిత్య కాన్సెప్ట్ చెప్పాడ‌ట‌. నాగ్‌కు బాగా నచ్చేసింద‌ట‌. ఇందులో నాని కూడా న‌టిస్తాడు. సీనియ‌ర్ నిర్మాత అశ్వ‌నీద‌త్ సినిమాను నిర్మిస్తున్నాడు. నాగార్జున రాజుగారి గ‌ది2 సినిమా విడుద‌లైన త‌ర్వాతే ఈ సినిమాను సెట్స్‌లోకి తీసుకెళ్ల‌డానికి స‌న్నాహాలు చేస్తార‌ట‌.

భ‌లేమంచిరోజు సినిమా త‌ర్వాత శ్రీరాం ఆదిత్య తెర‌కెక్కించిన శ‌మంత‌క మ‌ణి చిత్రం కూడా మ‌ల్టీస్టార‌రే. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి శ్రీరాం ఆదిత్య చేయ‌బోయే సినిమా కూడా మ‌ల్టీస్టార‌ర్‌.

More News

మ‌రో రీమేక్‌లో సునీల్‌

హాస్య‌న‌టుడిగా మంచి ఊపు మీదున్న స‌మ‌యంలో అందాల రాముడుతో హీరోగా మారాడు సునీల్‌. త‌మిళ చిత్రానికి రీమేక్ అయిన ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది.

ఒకే నెల‌లో రెండు సినిమాల‌తో..

2009లో విడుద‌లైన కిక్ చిత్రం యువ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ కెరీర్‌ని మ‌లుపు తిప్పింది. చూస్తుండ‌గానే.. 5 ఏళ్లు తిరిగేస‌రికి ఆగ‌డుతో 50 సినిమాల‌ని పూర్తిచేశాడు.

ఎన్టీఆర్‌కు అభినంద‌న‌ల వెల్లువ‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేసిన సినిమా 'జై ల‌వ‌కుశ‌'. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల‌వుతుంది. సాధార‌ణంగా ఏ త‌ల్లికైనా ముగ్గురు బిడ్డ‌లు పుడితే రామ ల‌క్ష్మ‌ణ భ‌ర‌తులు కావాల‌నుకుంటుంది.

నిఖిల్ స‌ర‌స‌న హెగ్డే

నిఖిల్ హీరోగా న‌టిస్తున్న సినిమాలో ఓ హీరోయిన్‌గా హెగ్డే ఎంపికైంది. హెగ్డే అన‌గానే పూజా హెగ్డే అనుకునేరు. కాదండీ స‌మ్య క హెగ్డే. క‌న్న‌డ‌లో హిట్ అయిన కిరిక్ పార్టీ సినిమాలో నిఖిల్ స‌ర‌స‌న న‌టించడానికి ఈ భామ ఎంపికైంది.

క్వాలిటీ కోస‌మే 'ఉంగ‌రాల రాంబాబు' లేట్‌!

సునీల్‌, మియాజార్జ్‌ జంటగా యునైటెడ్‌ కిరిటీ మూవీస్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై రూపొందిన చిత్రం 'ఉంగరాల రాంబాబు'. పరుచూరి కిరిటీ నిర్మాత. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 15న విడుదలవుతోంది.