90 రోజుల్లో మల్టీస్టారర్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ కథానాయకుడు వెంకటేష్, యువ కథానాయకుడు వరుణ్‌తేజ్ కాంబినేషన్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ మల్టీస్టారర్ మూవీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'ఎఫ్ 2' అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో వెంకీకి జోడీగా తమన్నా.. వరుణ్‌కు జోడీగా మెహరీన్ హీరోయిన్లుగా నటించనున్నారు. తాజాగా.. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. జూన్ 23న ఈ చిత్రాన్ని ప్రారంభించి.. 30 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాని 90 రోజుల్లో పూర్తి చేయాలని నిర్మాత భావిస్తున్నారు.
అలాగే.. కథానుసారం లండన్‌లో కొన్ని కీలక సన్నివేశాలు తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ నాటికి సినిమాని పూర్తిచేసి జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments