2 గంటలపాటు జగన్‌తో అంబానీ భేటీ.. ఏమేం చర్చించారు!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో.. ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భేటీ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ని ఆయన కలుసుకున్నారు. అంబానీ వెంట కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానీ ఉన్నారు. సుమారు రెండుగంటలకు పైగా జరిగిన ఈ భేటీలో పలు విషయాలపై నిశితంగా చర్చించారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్ సంస్థ భవిష్యత్తులో పెట్టాలనుకుంటున్న పెట్టుబడులకు సంబంధించి వారిమధ్య చర్చ జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు.. ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టాలని తన ఆలోచనను జగన్ ముందు అంబానీ ఉంచినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో రెండు నెలల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అంబానీ రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలియవచ్చింది.
ఫస్ట్ టైమ్ భేటీ..!
కాగా.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా అంబానీ సీఎంను కలవడం చర్చనీయాంశమైంది. రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో పెట్టుబడుల విషయమే ప్రధానం చర్చించారట. అంబానీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు రాగా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు మరికొందరు నేతలు.. ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖేష్, అనంత్ అంబానీలకు శాలువాలు కప్పిన విజయసాయిరెడ్డి జ్ఞాపికను బహూకరించి గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. క్యాంప్ ఆఫీస్‌కు రాగానే.. అంబానీ, అనంత్ అంబానీని సీఎం జగన్ ఘనంగా స్వాగతం పలికారు. వారిద్దరినీ శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. భేటీ అనంతరం జగన్ నివాసం నుంచి అంబానీ అండ్ కో ముంబైకు తిరుగుపయనం అయ్యారు.
ఇది కూడా చర్చించారా!?
వాస్తవానికి తిరుపతిలో రిలయెన్స్ ఏర్పాటు చేసే స్థలం వివాదంలో ఉందన్న వ్యవహారం ఎప్పట్నుంచో వార్తల్లో నానుతోంది. అయితే ఈ స్థలాన్ని గత ప్రభుత్వం కేటాయించగా.. ఈ స్థలంలోని కొంత భాగాన్ని ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకుంటే తాము పెట్టుబడులు పెట్టమని తేల్చి చెప్పేసిందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ విషయంపై కూడా భేటీలో భాగంగా చర్చించారని తెలుస్తోంది. భేటీకి సంబంధించి ఎలాంటి విషయాలు బయటికి రావడం.. రహస్యంగా జరగడంతో అసలు దేనిపై చర్చించారన్నది అధికారికంగా తెలియరాలేదు.
ఇదేం లెక్క..!?
వాస్తవానికి కలెక్టర్ మొదలుకుని సీఎం వరకు ఎవరైనా ఎక్కడికెళ్లాలన్నా ఒక షెడ్యూల్ అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే ఇవాళ షెడ్యూల్‌లో అంబానీతో జగన్ భేటీ అవుతారని మాత్రం అస్సలు లేదు. అయితే అధికారిక షెడ్యూల్‌లో లేకుండా భేటీ అవడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే పెద్ద పెద్ద బిజినెస్‌మెన్‌లకు బహుశా అపాయిట్మెంట్స్ కానీ.. షెడ్యూల్స్‌లో లెక్కలుండవేమో అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయ్. కాగా భేటీకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout