Mukarram Jah : 8వ నిజాం ముకరం ఝా టర్కీలో కన్నుమూత.. అంత్యక్రియలు హైదరాబాద్‌లోనే, కేసీఆర్ సంతాపం
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించిన నిజాం నవాబుల కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఎనిమిదో నిజాం నవాబు భర్కత్ అలీ ఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ టర్కీలోని ఇస్తాంబుల్‌లో కన్నుమూశారు. శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు రాజకుటుంబీకులు తెలిపారు. అయితే ముకరం ఝా చివరి కోరిక మేరకు ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లోనే జరగనున్నాయి. ఈ నెల 17వ తేదీన నిజాం భౌతికకాయం భారతదేశానికి రానుంది. ఈ సందర్భంగా ఆయన మృతదేహాన్ని చౌమహల్లా ప్యాలెస్‌కు తీసుకెళ్లి .. వారి మత సంప్రదాయాల ప్రకారం అసఫ్ జాహీ కుటుంబ సభ్యుల సమాధుల వద్ద అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
80లలో భారత్‌లో అత్యంత సంపన్నుడిగా ముకరం ఝా :
చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు, నిజాం పెద్ద కొడుకు ఆజమ్ ఝా, దుర్రె షెహవార్ దంపతులకు 1933 అక్టోబర్ 6న ముకరం ఝా జన్మించారు. ఆయన తల్లి ప్రిన్సెస్ దుర్రె షెహవార్ .. టర్కీ ఒట్టోమన్ సామ్రాజ్యం చివరి సుల్తాన్ కుమార్తె. ముకరం ఝా డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్లో, ఇంగ్లాండ్‌లోని హారో, పీటర్‌హౌస్, కేంబ్రిడ్జ్‌లో చదువుకున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, రాయల్ మిలటరీ అకాడమీ శాండ్‌హర్ట్స్‌లోనూ విద్యను అభ్యసించారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు అత్యంత ఆప్తుల్లో ముకరం ఝా కూడా ఒకరు. హైదరాబాద్ సంస్థానం చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన వారసుడిగా ముకరం ఝాను 1954 జూన్ 14న ప్రకటించారు. అప్పటి నుంచి 1971 వరకు ఆయన హైదరాబాద్ 8వ నిజాంగా వ్యవహరించారు. అంతేకాదు.. 1980లలో ముకరం ఝా దేశంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఐదు వివాహాలు, విడాకులు, ఇతర కారణాల వల్ల ఆయన ఆస్తులను కోల్పోవాల్సి వచ్చింది.
కేసీఆర్ సంతాపం:
హైదరాబాద్ ఎనిమిదో నిజాం ముకరం ఝా మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజాం వారసుడిగా విద్య, వైద్య రంగాల్లో సేవలు అందించారని సీఎం గుర్తుచేసుకున్నారు. ముకరం ఝా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. అంతేకాకుండా ముకరం ఝా పార్దీవ దేహం హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత అంత్యక్రియల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌ను ఆదేశించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com