New Secretariat:ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయం ఓపెనింగ్ : ముహూర్తం ఇదే.. తొలుత కేసీఆర్, తర్వాత మంత్రులు

  • IndiaGlitz, [Tuesday,March 14 2023]

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 30న మేష లగ్నంలో ఉదయం 06.08 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు తెలంగాన సీఎం కేసీఆర్. అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకి తన ఛాంబర్‌లోని సీట్లో కూర్చోనున్నారు ముఖ్యమంత్రి. అనంతరం మంత్రులు , అధికారులు వారి వారి సీట్లలో కూర్చోనున్నారు. సచివాలయ నిర్మాణం, లోపలి ఏర్పాట్లు తదితర వివరాలకు సంబంధించి త్రీడి యానిమేషన్‌ వీడియోను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయం నిర్మాణ పనులను, అక్కడి రోడ్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు.

6 వందల కోట్లకు పైగా వ్యయంతో కొత్త సచివాలయం:

కాగా... హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్‌ పక్కనే ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన సచివాలయం ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా లేదనే కారణంతో కేసీఆర్ ప్రభుత్వం .. ఆధునిక హంగులతో కొత్త సచివాలయ నిర్మాణానికి నడుం బిగించింది. దాదాపు 6 వందల కోట్లకు పైగా వ్యయంతో, 6 లక్షల చదరపు అడుగుల్లో కొత్త సచివాలయ నిర్మాణం జరగనుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శులు, అధికారుల కోసం అధునాతన హాల్స్‌ను నిర్మిస్తున్నారు. అలాగే మంత్రుల షేషీల్లోనే ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్ ఆఫీస్‌లు ఏర్పాటు చేయనున్నారు.

దక్కన్, కాకతీయ నిర్మాణ శైలిలో సచివాలయ నిర్మాణం:

కొత్త సచివాలయ నిర్మాణానికి డిజైన్లను వాస్తు ప్రకారం రూపొందించారు. దక్కన్, కాకతీయ నిర్మాణ శైలిలో ఈ డిజైన్లు వున్నాయి. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మాణాలు వుండనున్నాయి. సచివాలయంలోకి గాలి , వెలుతురు ధారాళంగా వచ్చేలా ప్లాన్ చేశారు. భవనం మధ్యలో భారీ ఎల్ఈడీ వాల్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో తెలంగాణ అభివృద్ధిని , 33 జిల్లాల కళ, సంస్కృతిని ప్రదర్శిస్తారు. ఒకేసారి 650 కార్లు, 500 ద్విచక్ర వాహనాలు పట్టేలా పార్కింగ్ సౌకర్యాలతో పాటు సిబ్బంది, సందర్శకుల కోసం బ్యాంక్, ఏటీఎం, డిస్పెన్సరీ, క్యాంటీన్, ఫైర్ స్టేషన్, విజిటర్స్ రూమ్స్‌ వుంటాయి.

More News

Alekhya Reddy:తండ్రిలా తోడు, తల్లిలా లాలన.. ఆయనే మా కుటుంబం : బాలయ్యపై తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్

సినీనటుడు నందమూరి తారకరత్న అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమను శోక సంద్రంలో ముంచెత్తింది.

Janasena :జనసేన పదేళ్ల ప్రస్థానం.. ఆవిర్భావ సభలో ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేనా, పవన్ ఏం చెప్పబోతున్నారు..?

ప్రజారాజ్యం పార్టీ వైఫల్యం తర్వాత .. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో శూన్యత మధ్య రాజకీయాల్లోకి ప్రవేశించారు

Katha Venuka Katha:‘కథ వెనుక కథ’.. మార్చి 24న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతోన్న సస్పెన్స్ థ్రిల్ల‌ర్

కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయటానికి ప్రారంభ‌మైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్.

Malavika Nair :ఓ మంచి అనుభూతినిచ్చే చిత్రం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' - మాళవిక నాయర్

'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో

Kalvakuntla Kavitha:కవితక్కకు బర్త్ డే విషెస్  : అభిమానం చాటుకున్న బీఆర్ఎస్ నేత.. ఏకంగా సముద్రం అడుగుకి వెళ్లి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్మమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి.