వెంకటేశ్ 'అసురన్' కి ముహూర్తం కుదిరింది
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం `అసురన్`. వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేశ్ హీరోగా రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్లు` ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే సెట్స్‌కు వెళ్లబోయే ఈ సినిమా కోసం వెంకటేశ్ తన లుక్‌ను మార్చుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. తాజా సమాచారం మేరకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 20 నుండి ప్రారంభం కానుందట. వెంకటేశ్ సరసన శ్రియా శరన్ హీరోయిన్గా నటిస్తుందని వార్తలు వినిపించాయి. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఇప్పుడు కన్నడ భామ ప్రియమణి హీరోయిన్గా నటించనుంది. వెంకటేశ్, ప్రియమణి కాంబినేషన్లో రానున్న తొలి సినిమా ఇదే కానుంది.
గత ఏడాది ఎఫ్ 2, వెంకీమామ చిత్రాలతో రెండు సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్న విక్టరీ వెంకటేశ్.. కొత్త ఏడాది సక్సెస్ఫుల్ సినిమా రీమేక్తోస్టార్ట్ చేయబోతున్నాడు. భూ వివాదాల నేపథ్యంలో సినిమా తెరకెక్కనుంది. తెలుగులో ఈ చిత్రాన్ని డి.సురేష్‌బాబు, కలైపులి థాను నిర్మించనున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది. అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అలాగే వెంకటేశ్ కొడుకుగా నటించే యువ హీరో కోసం చిత్ర యూనిట్ అన్వేషణలో ఉందట. ఈ ఏడాది సమ్మర్లోనే సినిమాను విడుదల చేయాలనేది చిత్ర యూనిట్ ప్లాన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com