మూడు రాజధానుల శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్..

మూడు రాజధానుల శంకుస్థాపన కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 16 నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీని ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు ఏపీ సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు మోదీ అపాయింట్‌మెంట్ కూడా కోరారు. మూడు రాజధానులతో పాటు పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా అదే రోజు నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు.

ఈ రెండు కార్యక్రమాల్లో ప్రత్యక్షంగానో లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానో పాల్గొనాలని మోదీని జగన్ కోరానున్నారు. మరో రెండు నెలల పాటు ముహూర్తాలు లేవని.. కాబట్టి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈనెల 16న నిర్వహించాలని తలపెట్టామని.. కాబట్టి వీలైనంత త్వరగా ప్రధాని అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరుతూ ప్రధాని కార్యాలయం సంయుక్త కార్యదర్శి శేషాద్రికి జగన్ ముఖ్య కార్యదర్రశి ప్రవీణ్ ప్రకాశ్ లేఖ రాసినట్టు తెలుస్తోంది.

More News

మహేష్ బర్త్ డే స్పెషల్‌గా ‘సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్..

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మహేష్‌కు విషెస్ చెబుతూ మైత్రి మూవీ మేకర్స్ ‘సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది.

విజయవాడ కోవిడ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురి మృతి

విజయవాడలో కోవిడ్ సెంటర్‌గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

రానా, మిహికల పెళ్లిపై అక్షయ్ ఆసక్తికర ట్వీట్..

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్టు నుంచి రానా అవుట్ పోతున్నాడు. శనివారం రాత్రి 8:30

ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. నేడు ఎన్ని కేసులంటే..

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా పది వేలు లేదంటే కాస్త అటు ఇటుగా పదివేల కేసులు నమోదవుతున్నాయి.

అక్కా చెల్లెలుగా స్టార్ హీరోయిన్స్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ముందు వ‌రుస‌లో ఉన్న‌ది స‌మంత అక్కినేని...