'భార‌తీయుడు 2' కి ముహూర్తం కుదిరింది...

  • IndiaGlitz, [Wednesday,January 02 2019]

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఇండియ‌న్ 2'. 22 ఏళ్ల ముందు విడుద‌లైన భార‌తీయుడు సినిమాకు ఇది సీక్వెల్‌. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సినిమాను నిర్మిస్తుంది.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ముహూర్తం కుదిరింది. జ‌న‌వ‌రి 18న సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది.

ఆంధ్ర ప్ర‌దేశ్‌, పొల్లాచ్చి, తైవాన్‌ల‌లో షూటింగ్ జ‌రుపుకోనుంది. తాజా స‌మాచారం ప్రకారం ఉక్రెయిన్‌లో కూడా ఈ సినిమాను చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.