ముహూర్తం కుదిరింది..
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో, నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అనీషాతో విశాల్‌కు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. లెటెస్ట్ సమాచారం అక్టోబర్ 9న వీరికి వివాహం చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది. మరి ఇంతకు ముందు విశాల్ చెప్పినట్లు తన పెళ్లిని నడిగర్ సంఘంలో చేసుకుంటాడా? లేక హైదరాబాద్‌లోనే చేసుకుంటాడా? అని తెలియాల్సి ఉంది. అయితే ఆలోపే నడిగర్ సంఘం కొత్త భవంతి పూర్తవుతుందని వార్తలు వినపడుతున్నాయి. మరి దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments