వెంకీ సినిమాకు ముహుర్తం కుదిరింది

  • IndiaGlitz, [Saturday,November 05 2016]

సాలాఖద్దూస్ సినిమాను తెలుగులో గురు పేరుతో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో విక్ట‌రీ వెంక‌టేష్‌, రితిక సింగ్ న‌టిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు. ఈ సినిమా త‌ర్వాత వెంక‌టేష్ నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలో న‌టించ‌నున్నారు. నిత్యామీన‌న్ కూడా ఈ సినిమాలో న‌టిస్తుండ‌టం విశేషం.

సిినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం సినిమా డిసెంబ‌ర్ 10న లాంచ‌నంగా ప్రారంభ‌మ‌వుతుంద‌ట‌. డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌తో రూపొంద‌నున్న ఈ సినిమా వెంక‌టేష్ క్యారెక్ట‌ర్ చాలా కొత్త‌గా ఉంటుంద‌ని యూనిట్ వ‌ర్గాలు అంటున్నాయి.