ఆ రీమేక్ కు ముహుర్తం కుదిరిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో అర్జున్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన హిందీ చిత్రం 2 స్టేట్స్`. చేతన్ భగత్ రచించిన నవలాధారంగా 2014లో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాను నూతన దర్శకుడు వెంకట్ రెడ్డి తెలుగులో రూపొందించనున్నారు. అడివి శేష్ హీరోగా నటించబోతున్న ఈ చిత్రంతో.. సీనియర్ నటుడు డా.రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని కథానాయికగా తెలుగుతెరకు పరిచయం కానుంది.
ఈ చిత్రాన్ని ఈ నెల 24న ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే.. అడివి శేష్ తల్లి పాత్రలో నిన్నటి తరం బాలీవుడ్ నటి భాగ్యశ్రీ నటించనున్నట్టు సమాచారం. 1989లో వచ్చిన బాలీవుడ్ మూవీ మైనే ప్యార్ కియా` (ప్రేమపావురాలు)లో సుమన్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు భాగ్యశ్రీ. అంతేకాదు.. 1997లో డా.రాజశేఖర్ నటించిన ఓంకారం` సినిమాలో కీలకపాత్ర పోషించారు. అలాగే.. 1998లో బాలకృష్ణ నటించిన యువరత్న రాణా` చిత్రంలో కూడా ఓ కీలకపాత్రలో నటించారీమే. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల విరామం అనంతరం మళ్ళీ తెలుగులో నటిస్తున్నారు భాగ్యశ్రీ. లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎల్.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ బాణీలు సమకూరుస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com