చరణ్ , కొరటాల చిత్రానికి ముహుర్తం కుదిరిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ చిత్రాలతో హ్యాట్రిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు కొరటాల శివ. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్‌బాబు కథానాయకుడిగా భరత్ అనే నేను (ప్రచారంలో ఉన్న పేరు) రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తరువాత తన తదుపరి చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో చేయనున్నారు కొరటాల. ఈ చిత్రం ఆగిపోయిదంటూ ఈ మధ్య వార్తలు వినిపించాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని టాలీవుడ్లో కథనాలు వినిపిస్తున్నాయి. కొరటాల గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా మెసేజ్‌తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందని తెలిసింది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. కొరటాల ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతమందించే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments