ఎన్టీఆర్ - పూరి మూవీ ఎనౌన్స్ మెంట్ ముహుర్తం ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఆంధ్రావాలా, టెంపర్ చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. అయితే... వీరిద్దరూ కలిసి మూడవ సినిమా త్వరలో చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఎన్టీఆర్ కి పూరి కథ చెప్పడం...కథ విని ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయింది అని కూడా వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే...జనతా గ్యారేజ్ తో బ్లాక్ బష్టర్ సాధించిన ఎన్టీఆర్ తన రేంజ్ మరింత పెంచే డైరెక్టర్ కోసం చూస్తున్నాడు. అందుచేతనే పూరి విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు అంటూ మరో వార్త తెరపైకి వచ్చింది. అయితే...ఎన్టీఆర్ రేంజ్ కి తగ్గ సినిమా తీయడానికి...అది కూడా తక్కువ టైమ్ లో తీయగల డైరెక్టర్ అంటే పూరి తప్ప వేరే డైరెక్టర్ ఎవరూ కనపడడం లేదు. అందుచేత ఎన్టీఆర్ తదుపరి చిత్రాన్ని పూరితో చేయడానికి ఫిక్స్ అయినట్టు సమాచారం. అయితే...ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు అంటే...మాకు అందిన సమాచారం ప్రకారం... ఎన్టీఆర్ - పూరి కాంబినేషన్లో రూపొందే భారీ చిత్రాన్ని ఇజం సక్సెస్ మీట్ లో ఎనౌన్స్ చేయాలి అనుకుంటున్నారట. మరి.. ఇది నిజమో కాదో తెలియాలంటే ఇజం సక్సెస్ మీట్ వరకు ఆగాల్సిందే..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments