నితిన్ కు ముహుర్తం కుదిరింది....

  • IndiaGlitz, [Friday,November 18 2016]

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరో వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీరప్రేమగాథ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మాత‌లుగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్ ఇటీవ‌ల ప్రారంభ‌మైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. నితిన్ స‌ర‌స‌న మేఘ ఆకాష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 17 నుండి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకోనుంది. ఈ సినిమాను ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీక‌రించ‌నున్నారు. ఈ చిత్రానికి యువ‌రాజ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండా, విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్నాడు. అఆ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత నితిన్ నటిస్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి.

More News

పవన్ తో పూజాహెగ్డే....

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు)

నవంబర్ 25 న 'రెమో' రిలీజ్ సెన్సార్ పూర్తి

శివకార్తికేయన్, కీర్తిసురేష్ జంటగా , బక్కియ రాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందిన లవ్ ఎంటర్టైనర్ `రెమో`. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్పై ఆర్.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు విడుదల చేస్తున్నారు.

సూర్య క్రేజీ కాంబో.....

సింగం 3తో డిసెంబర్ 16న థియేటర్స్ లో సందడి చేయనున్న హీరో సూర్య

నిఖిల్ ఆనందం

స్వామిరారా', 'కార్తికేయ‌', 'సూర్య vs సూర్య' లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో వ‌రుసగా హ్యాట్రిక్‌ సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో యూత్‌లో  యంగ్ఎన‌ర్జిటిక్ స్టార్ గా ఎదిగిన హీరో నిఖిల్ మ‌రో వినూత్న‌మైన క‌థాంశంతో  మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన చిత్రం 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'.

ఆ ఇద్దరి హీరోల గురించి తెలుసుకునే వచ్చా - మంజిమ

అక్కినేని నాగచైతన్య-గౌతమ్ మీనన్ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం సాహసం శ్వాసగా సాగిపో.