చైతు, సమంతల పెళ్లికి ముహుర్తం ఖరారు..!
Send us your feedback to audioarticles@vaarta.com
నాగ చైతన్య, సమంత ప్రేమించుకోవడం...త్వరలో పెళ్లి చేసుకోబోతుండడం తెలిసిన విషయమే. అయితే...ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనేదే తెలియాల్సి ఉంది. అఖిల్, శ్రేయా భూపాల్ ఎంగేజ్ మెంట్ డిసెంబర్ 9న హైదరాబాద్ లో ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అఖల్ వివాహం మేలో జరగనున్నట్టు చైతన్య ఓ ఇంటర్ వ్యూలో తెలియచేసారు.
ఇదిలా ఉంటే.... చైతన్య, సమంతల పెళ్లి వచ్చే సంవత్సరం ఉంటుంది అని ప్రచారం జరుగుతుంది కానీ...ఎప్పుడు అనేది క్లారిటి లేదు. తాజాగా చైతు, సమంతల పెళ్లి గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏమిటంటే...వచ్చే సంవత్సరం ఆగష్టులో చైతన్య, సమంతల పెళ్లి చేయడానికి నిర్ణయించారట. ముందుగా హిందు సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని ఆతర్వాత క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చర్చిలో పెళ్లి చేసుకుంటారట. మరి...ప్రచారం పై సమంత క్లారిటి ఇస్తుందేమో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout