విష్ణు కొత్త సినిమాకు ముహుర్తం కుదిరింది
Send us your feedback to audioarticles@vaarta.com
లక్కున్నోడు ప్లాప్ తర్వాత మంచు విష్ణు హీరోగా కొత్త సినిమా ప్రారంభం అవుతుందని, ఈ సినిమా ఆచారి ఆమెరికా యాత్ర అనే టైటిల్‌తో రూపొందనుందనే సంగతి తెలియజేశాం. ఇప్పుడు ఈ సినిమా అధికారకంగా మార్చి 19న తిరుపతి ప్రారంభం కానుంది. మంచు విష్ణుతో దేనికైనా రెడీ, ఈడోరకం-ఆడోరకం వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.
ప్రముఖ నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పణలో కీర్తి చౌదరి, కిట్టు చౌదరి నిర్మాతలుగా ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ రూపొందనుంది. సినిమా ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ జరుపుకోనుంది. బ్రహ్మానందం ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నాడు. సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments