చిరుకు ముహుర్తం కుదిరిందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తమిళ్ లో విజయం సాధించిన కత్తి సినిమాని తన 150వ సినిమాగా రీమేక్ చేయాలని చిరు ఫిక్స్ అయ్యారు. బ్రూస్ లీ ఆడియో వేడుకలో స్వయంగా చిరంజీవే ఓ 15 రోజుల్లో తన 150వ సినిమా గురించి ప్రకటిస్తానని చెప్పారు.
అయితే తాజా సమాచారం ప్రకారం చిరు 150వ సినిమాకి ముహుర్తం కుదిరిందట. ఈనెల 16న అంటే తనయుడు చరణ్ నటించిన బ్రూస్ లీ రిలీజ్ రోజున చిరంజీవి 150వ సినిమా గురించి ప్రకటిస్తారట. సతీమణి సురేఖ, తనయుడు చరణ్ ఈ సినిమాకి నిర్మాతలు అని చిరు బ్రూస్ లీ ఆడియో వేడుకలో ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి డైరెక్టర్ వినాయక్ ఫైనల్ చేసారట. ఠాగూర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన.. చిరు, వినాయక్ కాంబినేషన్ ఈసారి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనున్నారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com