ముహుర్తం కుదిరింది కానీ...
- IndiaGlitz, [Thursday,March 07 2019]
నందమూరి బాలకృష్ణ 104వ చిత్రానికి రంగం సిద్ధమవుతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాను మార్చి 28 లాంఛనంగా ప్రారంభిస్తారట.
అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఎన్నికల తర్వాతే ప్రారంభిస్తారు. ముందు ఈ సినిమాను బాలకృష్ణ తన స్వంత బ్యానర్ ఎన్.బి.కె.ఫిలింస్‌పై నిర్మించాలనుకున్నాడు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ 'యన్.టి.ఆర్' ఎఫెక్ట్‌తో బాలయ్య నిర్మాణం చేయాలనుకోవడం లేదట. ఆయన స్థానంలో సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తాడని సమాచారం.