Mudragada: కాపుల్లో చెరగని 'ముద్ర'గడ.. వైసీపీలో చేరికతో విపక్షాల్లో అలజడి..
Send us your feedback to audioarticles@vaarta.com
దశాబ్దాలకు కాపులకు పెద్దగా వ్యవహరిస్తున్నారు. కాపు రిజర్వేషన్లు కోసం సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. ఇందుకోసం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటూ మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. తన స్వప్రయోజనాలు పక్కన పెట్టి కాపు ఉద్యమం కోసం పదవులు త్యాగం చేశారు. కాపు ఉద్యమ సమయంలో ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో అరెస్ట్ చేయించి తీవ్రంగా అవమానించారు. దీంతో కాపుల్లో చంద్రబాబు పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. తర్వాత జనసేన పార్టీలో చేరతారని వార్తలొచ్చాయి.
వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం..
అయితే కులరాజకీయాల నేపధ్యంలో జనసేనతో పొత్తులో ఉన్న చంద్రబాబు.. ముద్రగడ చేరకుండా అడ్డుకున్నారని..ఇందుకు నాదెండ్ల మనోహర్ సహకరించారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్.. తనకు సలహాలు ఇవ్వొద్దంటూ కాపు ఉద్యమ సారధులైన ముద్రగడ పద్మనాభం, చేగోండి హరిరామజోగయ్యలను పరోక్షంగా విమర్శించారు. దీనిపై కాపు నేతల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. అలాంటి బలమైన నేతలు కాపులకు అండదండగా ఉంటున్న వైసీపీలో చేరడంతో ఆ పార్టీకి కొంత బలం చేకూరనుంది. ఇప్పటికే జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ పార్టీలో చేరగా.. తాజాగా ముద్రగడ కుటుంబం సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
కాపులకు అండగా సీఎం జగన్..
ఉభయ గోదావరి జిల్లాల్లో సంఖ్యాబలంగా కాపులు అధికంగా ఉన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 34 స్థానాల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. కాపు ఉద్యమ నేత అయినా పద్మనాభం చేరికతో పార్టీకి బలం పెరగనుంది. ఆది నుండి సీఎం జగన్ కాపులకు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. పాదయాత్ర సమయంలోనే కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాంకేతికంగా సాధ్యం కాదని తేల్చి చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసినా ఇస్తానని మోసం చేశారు. అలాగే జగన్.. కాపునేస్తం పథకం అందించి కాపు సామాజికవర్గంలో ఆర్దికంగా వెనుకబడిన వారికి చేయూతనిచ్చారు.
చంద్రబాబు కుట్రలకు పవన్ బలి..
అంతేకాకుండా దాదాపు 2 ఎంపీ స్థానాలు, 19 ఎమ్మెల్యే స్థానాలను కాపు అభ్యర్ధులకు కేటాయించారు. జనసేనలో చేరితో చంద్రబాబు కుట్రలు పసిగడతారని జోగయ్యను, పద్మనాభం లాంటి వారిని రాకుండా అడ్డుకున్నారు. అయితే ఇప్పుడు వారు వైసీపీలో చేరడంతో కాపుల ఓట్ల జనసేన వైపు మళ్లకుండా ఉంటాయని రాజకీయ వర్గాల్లో బలంగా వినపడుతోంది. దీంతో చంద్రబాబు పరోక్షంగా జనసేనకు కూడా అన్యాయం చేశారనే భావన కాపుల్లోనూ వ్యక్తమవుతోందని చెబుతున్నారు. మొత్తానికి కాపు నేతలను కాదనుకుని చంద్రబాబును నమ్ముకున్న పవన్ కల్యాణ్ రాజకీయ భవిత్వం కూడా ప్రశ్నార్థకం అయిందని పేర్కొంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments