Mudragada: సినిమాల్లో పవన్ హీరోమో..రాజకీయాల్లో నేనే హీరో.. పవన్‌పై ముద్రగడ సెటైర్లు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికలు అయిపోయిన తర్వాత జనసేన పార్టీ క్లోజ్ అవ్వడం ఖాయమని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరిన మరుసటిరోజే పవన్ కల్యాణ్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. తాను వైసీపీలో చేరడం మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ముద్రగడ ఖండించారు. రాబోయే 30 సంవత్సరాలు జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని జోస్యం చెప్పారు.
మీడియాతో ఆయన మాట్లాడుతూ "సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో నాపై తప్పుడు రాతలు రాస్తున్నారు. నేనేమీ కండీషన్లు పెట్టి వైసీపీలో చేరలేదు. ఎలాంటి షరతులు లేకుండానే వైఎస్ఆర్సీపీలో చేరా. ప్రజలకు సేవ చేయడానికే ఈ పార్టీలో చేరా. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో కావచ్చేమో కానీ.. రాజకీయాల్లో మాత్రం నేనే హీరోని.. మీరా నాకు పాఠాలు చెప్పేంది?. రాజకీయాల్లో మొలతాడు లేనివాడు కూడా నన్ను విమర్శిస్తున్నాడు. మీరు చెప్పినట్లు నేనేందుకు రాజకీయం చేయాలి. నాకు చెప్పడానికి మీరెవరూ అంటూ" ప్రశ్నించారు.
జగన్ దగ్గరకు ఎందుకు వెళ్లావు.. పవన్ వద్దకు ఎందుకు వెళ్లలేదంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. జగన్ కుటుంబానికి రాజకీయంగా ఒక చరిత్ర ఉంది. కాపుల, దళితుల కోసం నేను ఉద్యమాలు చేశా.దళితుల భిక్షతోనే ఈ స్థాయికి వచ్చా. నేనేదో ఆశించి వైసీపీలో చేరలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పార్టీలో చేరాను. వైసీపీ వ్యవస్థాపకుల్లో నేనూ ఒకడిని కానీ కొన్ని కారణాల వలన జగన్‌కు దూరమయ్యాయను.. మళ్లీ ఇప్పుడు చేరడం ఆనందంగా ఉంది. అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా. నాకు రాజకీయ భిక్ష పెట్టింది బీసీలు, దళితులు, కాలపులు ఐదుశాతం ఉంటారు. నేను రాజకీయాలకు రావడానికి కాపులు కారణం కాదు. నేను ఎవ్వరి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు కులం కాదు ముఖ్యం.. నాకు వర్గం ముఖ్యం" అని తెలిపారు.
మరోవైపు పొత్తులో భాగంగా జనసేనకు 21 సీట్లు కేటాయించడంపైనా సెటైర్లు వేశారు. ఆ 21 సీట్లు కూడా టీడీపీకి తిరిగి ఇచ్చేస్తే మంచిదని సూచించారు. పవన్ కళ్యాణ్‌ను మారుద్దామని ఎంతగా ప్రయత్నించినా కుదరలేదని.. తక్కువ సీట్లలోనే పోటీకి పరిమితం కావటంతో పవన్ కళ్యాణ్ బలమెంతో ప్రజలకు అర్థమైపోయిందంటూ విమర్శలు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments