మడ్ రేస్ యొక్క రియల్ యాంబియన్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసే మూవీ 'మడ్డి' - చిత్ర దర్శకుడు డా. ప్రగభల్
- IndiaGlitz, [Monday,March 01 2021]
పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం 'మడ్డి'. భారీ బడ్జెట్‌తో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఇంతకుముందు ఎన్నడూ చూడని కాన్సెప్ట్ తో ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రంతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. PK7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బురదలో సాగే రేసింగ్ నేపథ్యంలో సాహసోపేతమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్నఈ చిత్రం టీజర్ ఇప్పటికే 10మిలియన్లకు పైగా రియల్‌టైమ్ వ్యూస్ సాధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్ దసపల్లా హోటల్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చిత్ర దర్శకుడు డా. ప్రగభల్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ - మూడు స్టేజెస్‌లో చాలా కష్టపడాల్సి వచ్చింది నేను మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డి పూర్తి చేశాను. ఒక యూనిక్ మూవీని ప్రేక్షకులకు అందించాలని మా టీమ్ అందరం ఐదేళ్లు కష్టపడి ఈ మూవీని తెరకెక్కించాం. ఆఫ్ రోడ్ మడ్ రేస్ అనేది భారతదేశంలో కొత్త కానెప్ట్ కాబట్టి ప్రీ ప్రొడక్షన్, మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఈ మూడు స్టేజెస్‌లో చాలా కష్టపడాల్సి వచ్చింది. ముఖ్యంగా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఈ కథకి యాప్ట్ అయ్యే ఆర్టిస్టులు, ప్రాంతాల్ని ఎంచుకోవడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమా కోసం ఆఫ్-రోడ్ రేసింగ్‌లో ప్రధాన నటులకు రెండేళ్లు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆర్టిస్టులు ఏ డూప్ లేదా జూనియర్ స్టంట్ మేన్ లేకుండా సాహసోపేత విన్యాసాలు చేశారు.
రియలిస్టిక్‌గా చిత్రీకరించాం
ఈ సినిమా కోసం రియల్ మడ్ రేసర్స్ బ్యాక్‌గ్రౌండ్ ప్లేయర్‌లుగా నటించారు. ఈ సినిమా మేకింగ్‌లో నా ముందు ఉన్న గొప్ప సవాలు ఏమిటంటే, మడ్ రేసింగ్ వంటి క్రీడను దాని థ్రిల్ మరియు పంచ్ కోల్పోకుండా ప్రేక్షకులకు పరిచయం చేయడమే. మట్టి రేసింగ్ మరియు బురదలోని విన్యాసాలను రియలిస్టిక్‌గా చిత్రీకరించాం. ఇది ప్రేక్షకులకు తప్పకుండా కొత్త అనుభూతినిస్తుంది. మడ్డీకి అనువైన ప్రదేశాలను కనుగొనటానికి నాకు ఒక సంవత్సరానికి పైగా పట్టింది. ఈ సినిమా మేకింగ్ సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. మా టీమ్ అందరూ నాకు సపోర్ట్‌గా నిలబడి ఈ మూవీని కంప్లీట్ చేశారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
రియల్ వెహికిల్స్‌ని ఉపయోగించాం.
ఈ సినిమా కోసం నేషనల్ లెవల్‌లో ఉపయోగించే రియల్ మడ్ రేసింగ్ ట్రాక్‌లను, రియల్ మోడిఫైడ్ వెహికిల్స్‌ని ఉపయోగించాం. మాములుగా ఇండియా, విదేశాలలో సింగిల్ ట్రాక్ మడ్ రేస్‌లనే మనం చూస్తుంటాం. కాని ఈ సినిమాలో మూడు డిఫరెంట్ ప్యాట్రన్స్‌లో ఉన్న మడ్ రేసింగ్‌లను మీరు చూడొచ్చు.
కేజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్, హాలీవుడ్ ఫేమ్ కె జి రతీష్ సినిమాటోగ్రఫి
ఈ సినిమా ప్రధానంగా రెండు వేర్వేరు జట్ల మధ్య శత్రుత్వం, ప్రతీకారం గురించి ఉన్నప్పటికీ ఫ్యామిలీ డ్రామా,లవ్, కామెడీ, సాహసం ఇలా ప్రతి ఎమోషన్ ఈ మూవీలో ఉంటాయి. ఇలాంటి ఒక డిఫరెంట్ సినిమాలో సౌండ్, విజువల్స్ అనేవి ప్రధాన ఆకర్షనగా నిలుస్తాయి కాబట్టి ఈ సినిమా మ్యూజిక్ కోసం కేజిఎఫ్ చిత్రానికి సంగీతాన్ని అందించిన రవి బస్రూర్ ని సంప్రదించాను. ఆయనకి ఈ కాన్సెప్ట్ బాగా నచ్చడంతో అద్బుతమైన మ్యూజిక్ కంపోజ్ చేశారు. అలాగే హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కె జి రతీష్ బ్రిలియంట్ విజువల్స్ ఇచ్చారు.
రియల్ మడ్ రేస్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు.
ఇప్పటికే ఇలాంటి మూవీస్ ని రూపొందించాలని కొంత మంది ప్రయత్నించి విఫలమ్యారని తెలిసింది. నా ఫస్ట్ మూవీ ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించాలి అని నిర్ణయించుకుని ఇలాంటి ఒక అడ్వెంచరస్ కానెప్ట్‌ని ఎంచుకోవడం జరిగింది. రేపు థియేటర్లో రియల్ మడ్ రేస్ యొక్క యాంబియన్స్‌ని ఆడియన్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఆల్ ఏజ్ గ్రూప్స్ కి అర్ధం అయ్యేలా ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది.
ఫారెస్ట్ లోకేషన్స్‌లో షూటింగ్
ఈ చిత్రం ఎక్కువభాగం తమిళనాడు, కేరళలోని హిల్ స్టేషన్స్‌లో చిత్రీకరించడం జరిగింది. ఈ కథ పరంగా అలాంటి ప్రదేశాలు ఎక్కువగా అవసరం అయ్యాయి. ముఖ్యంగా ఫారెస్ట్ లోకేషన్స్‌లో షూటింగ్ ఛాలెంజింగ్‌గా అనిపించింది.
మా ఎఫర్ట్‌ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం థ్రిల్లింగ్ గా అనిపించింది.
టీజర్ 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మా జెన్యూన్ ఎఫర్ట్‌ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం థ్రిల్లింగ్ గా అనిపించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళంతో భాషల్లో స్ట్రయిట్‌గా రిలీజ్ చేస్తున్నాం. హిందీ మరికొన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. ఏప్రిల్ చివరివారం లేదా మే ఫస్ట్‌వీక్ లోప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో హరీష్ పెరాడి, ఐ ఎం విజయన్ & రెంజీ పానికర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.