ఎం.ఎస్.ధోని ఆడియో వేడుక అతిధులు వీళ్లే..!
Send us your feedback to audioarticles@vaarta.com
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎం.ఎస్.ధోని జీవితకథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ మూవీ ఎం.ఎస్.ధోని అన్ టోల్డ్ స్టోరీ. ఈ చిత్రాన్ని నీరజ్ పాండే తెరకెక్కించారు. ఈ చిత్రంలో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ధోని పాత్రను పోషించారు. కైరా అద్వానీ, దిశా పటానీ, అనుపమ ఖేర్, భూమిక తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ మూవీ తెలుగు వెర్షెన్ లోని ప్రతి గల్లీలోని ధోనియే...అనే పాటను దర్శకధీర రాజమౌళి నిన్న ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఎం.ఎస్.ధోని ఆడియో లాంఛ్ కార్యక్రమాన్ని ఈనెల 24న హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంఛ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడియోను భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ ధోని, దర్శకధీర రాజమౌళి విడుదల చేయనున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్, మరాఠీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com