హెలికాఫ్టర్ షాట్ మాదిరిగానే రిటైర్మెంట్ షాక్.. ధోనీ వెంటే రైనా..
Send us your feedback to audioarticles@vaarta.com
మహేందర్ సింగ్ ధోని.. భారత క్రికెట్ దిగ్గజం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. అద్భుతమైన కెప్టెన్.. కూల్ కెప్టెన్.. అభిమానులకు అత్యంత చేరువైన కెప్టెన్‌గా అతి కొద్ది కాలంలోనే ధోని మారిపోయాడు. స్వాతంత్ర్య దినోత్సవం రోజే.. ప్రజానీకానికి, మీడియాకు కనీసం ఎవ్వరి ఊహకు కూడా అందని విధంగా ఓ వీడియో సందేశం ద్వారా సింపుల్‌గా తన రిటైర్‌మెంట్ ప్రకటించేశాడు. ఎలాంటి ప్రెస్‌మీట్ కానీ.. ఫైనల్ స్పీచ్‌కానీ లేకుండానే తన హెలికాఫ్టర్ షాట్ మాదిరిగానే రిటైర్మెంట్ షాక్‌ను ఇచ్చాడు. జార్ఖండ్ డైనమైట్ పేల్చిన రిటైర్‌మెంట్ బాంబు ఏకంగా అభిమానుల గుండెల్లో పేలింది.
ఎప్పుడో కపిల్‌దేవ్ టైమ్‌లో.. 1983లో వరల్డ్ కప్ వచ్చింది. ఇక అదే ప్రథమం.. అదే చివరిది అనుకుని క్రికెట్ ప్రేక్షకులు మనసులకు సర్ది చెప్పుకుంటున్న సమయంలో నేనున్నానంటూ హహేందర్ సింగ్ ధోనీ వచ్చాడు. అద్భుతమైన విజంయం.. వరల్డ్ కప్ తీసుకొచ్చి దేశం ఒడిలో సగర్వంగా పెట్టాడు. అత్యద్భుత సారథి మాత్రమే కాదు.. గొప్ప ఫినిషర్.. 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌కు సెలవని సింపుల్‌గా చెప్పేసి అభిమానులకు మోయలేనంత గుండె బరువును మిగిల్చాడు. ధోనితో పాటే తానంటూ సురేశ్ రైనా కూడా రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ‘‘కెరీర్ మొత్తం నన్ను ప్రేమించి.. మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. రాత్రి 7:29 నుంచి వీడ్కోలు పలికినట్టుగా భావించండి’’ అని ఓ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో ధోనీ పోస్ట్ చేశాడు.
2004లో కెరీర్‌ను ఆరంభించిన ధోనీ గతేడాది వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై చివరి మ్యాచ్ ఆడాడు. 2011లో దేశానికి వరల్డ్ కప్ అందించాడు. ఆరేళ్ల క్రితం కూడా భారత జట్టు ఆసీస్ పర్యటనలో ఉన్నప్పుడు సడెన్‌గా ధోనీ టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. టెస్టు సిరీస్ మధ్యలోనే అతను ఈ కీలక నిర్ణయం ప్రకటించి.. ఆ వెంటనే కోహ్లీకి పగ్గాలు అప్పజెప్పాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది నిమిషాలకే అతను కూడా అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించాడు. ‘నీతో కలసి ఆడడం కంటే మించింది ఏదీ లేదు. ఎంతో గర్వంగా.. ఈ ప్రయాణంలో నీతో కలసి నడవాలనుకుంటున్నా. భారతావనికి కృతజ్ఞతలు. జైహింద్’ అని రైనా ఇస్టాలో రాశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com