బన్నీ స్థానంలో క్రికెటర్ ధోనీ.. అలీ ఔట్!

  • IndiaGlitz, [Thursday,April 18 2019]

ప్రముఖ బస్ టిక్కెటింగ్ ప్లాట్‌ఫాం ‘రెడ్‌బస్’ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాచురణ పొందిన ప్లాట్‌ఫాం ఇది. దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ వ్యవహరించిన విషయం విదితమే. బన్నీతో పాటు అలీ, మరో మహిళ కూడా ఈ యాడ్‌లో ఉంటారు. ఈ యాడ్ యూట్యూబ్‌, టీవీల్లో చాలా సార్లు అందరూ చూసే ఉంటారు. అయితే ఇప్పటి వరకూ దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న బన్నీ ఇకపై ప్రకటనలో కనిపించరు. బన్నీతో పాటుగా అలీ కూడా ప్రకటనలో కనిపించరన్న మాట. బన్నీ స్థానంలో ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీని బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకుంటున్నట్లు ‘రెడ్‌బస్’ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇకపై ధోనీ...

తమ బ్రాండ్‌కు సంబంధించిన అన్ని ప్రసార మాధ్యమ ప్రకటనల్లో ధోనీ పాల్గొంటారని, త్వరలోనే ప్రచార చిత్రాలు విడుదల చేస్తామని రెడ్‌బస్‌ సీఈఓ ప్రకాశ్‌ సంగం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రయాణానికి టికెట్‌ బుక్‌ చేసుకునే ప్రక్రియను ఎంతో సౌకర్యవంతం చేసిన రెడ్‌బస్‌తో భాగస్వామ్యం సంతోషం కలిగిస్తోందని ఎంఎస్ ధోనీ అన్నారు. గురువారం నాడు  సింగ్ గెటప్‌‌లో ధోనీ ఉన్న చిత్రాన్ని రెడ్‌బస్ సంస్థ విడుదల చేసింది.

కాగా.. 2006లో ఒక బస్సుతో సంస్థ ప్రారంభించి.. ఇప్పుడు 2,500 మందికి పైగా ఆపరేటర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రెండు కోట్ల మందికి పైగా ప్రయాణికులకు సేవలందిస్తూ, దేశంలోనే అతిపెద్ద, నమ్మకమైన బ్రాండ్‌గా రెడ్‌బస్‌ నిలిచిందని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. కాగా ఇప్పటి వరకూ అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్‌గా మెప్పించారు అయితే ధోనీ ఏ మాత్రం మెప్పిస్తారో వేచి చూడాల్సిందే మరి. అయితే అసలు బన్నీని ఎందుకు పక్కనపెట్టారనే విషయం మాత్రం తెలియరాలేదు. అయితే అలీ, మరో మహిళ స్థానంలో ఎవరు ఉన్నారనే విషయం తెలియాల్సి ఉంది.

More News

ప్రతినాయకిగా

అందాల తార నయనతార ఇప్పుడు మరో వైవిధ్యమైన పాత్రలో మెప్పించనున్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'దర్బార్‌'.

కొడుక్కి సారీ చెప్పిన నాని

నేచురల్‌ స్టార్‌ నాని తన కొడుకు అర్జున్‌కి సారీ చెప్పాడు. ఇంతకు కొడుక్కి నాని ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చిందో తెలుసా! వివరాల్లోకెళ్తే..

నేను గెలిచాను.. థ్యాంక్యూ కేసీఆర్ గారు..: శ్రీరెడ్డి

టాలీవుడ్‌లో ‘కాస్టింగ్ కౌచ్’పై నటి శ్రీరెడ్డి చేసిన పోరాటానికి ఫలితం దక్కింది.

‘డేటాచోరీ’ కేసులో యూఐడీఏఐ కీలక ప్రకటన.. వాట్ నెక్స్ట్

తెలుగు రాష్ట్రాల్లోనే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'డేటాచోరీ' కేసులో భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక ప్రకటన జారీ చేసింది.

'ఆకాశ‌వాణి విశాఖ‌ప‌ట్ట‌ణ కేంద్రం' టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌

అంద‌రికీ స‌ముద్రం దాటి సీత‌ను క‌లిసిన రాముడు క‌థ తెలుసు.. కానీ ఇంటి ముందే ఉండి క‌న్న తండ్రిని క‌ల‌వ‌లేని ఈ కార్తీక్ క‌థ తెలుసా! అని అంటున్నారు.