సరికొత్త గెటప్‌తో అభిమానులను షాక్‌కు గురి చేసిన ధోనీ
Send us your feedback to audioarticles@vaarta.com
మహేంద్ర సింగ్ ధోనీ... భారత క్రికెట్‌లో ఒక సంచలనం.. ఓ ట్రెండ్ సెట్టర్.. హెలికాఫ్టర్ షాట్స్‌తో చూపు మరల్చుకోనివ్వడు.. ఆటగాడిగా రికార్డులు.. కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన నేపథ్యం అతనిది. భారత్‌కు 1983 తర్వాత ప్రపంచ కప్ కోసం ఎదురు చూసి చూసి అభిమానులు ఇక అది తీరని కలేనని ఫిక్స్ అవుతున్న తరుణంలో ప్రపంచ కప్‌ను తీసుకొచ్చి భరతమాత ఒడిలో అలంకరించిన ఘనుడు. వచ్చిన తొలినాళ్లలో ధోనీని ఎవరూ మరచిపోలేరు. జులపాల జుట్టుతో కనిపించేవాడు. దీంతో ఆయన అభిమానులు సైతం ధోనీలాగే జుట్టు పెంచుకుని తిరిగేవారు. తాజాగా ధోనీ గెటప్.. అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.
ఎంఎస్ ధోనీపై అభిమానుల గుండెల్లో ఆయనకున్న స్థానం ఎప్పటికీ చెరగదు. తాజాగా ఆయన సరికొత్త గెటప్‌తో ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశాడు. నున్నగా గుండు గీయించుకుని బౌద్ధ సన్యాసిగా ఉన్న అతని గెటప్ చూసి ఫ్యాన్స్‌తో పాటు క్రీడాభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ కొత్త అవతారం ఏంటంటూ ... సోషల్ మీడియాలో చర్చోపచర్చలు జరుపుతున్నారు. జులపాల జుట్టుతో ఓ ట్రెండ్ సెట్ చేసిన ధోనీని చూసిన ఫ్యాన్స్.. ఇప్పుడిలా గుండులో తమ స్టార్ కనిపించడంతో షాక్‌కు గురవుతున్నారు. అసలు ఎందుకు ఆయన ఈ గెటప్‌లోకి మారాడు? పైగా బౌద్ధ సన్యాసిలా ఎందుకు మారాడు? అనేది చర్చనీయాంశంగా మారింది.
కాగా.. బౌద్ధ సన్యాసి రూపంలో ఉన్న ధోనీ ఫొటోను స్టార్ స్పోర్ట్స్ తన ట్విటర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. అంతేగాక ఈ అవతారం గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండంటూ సరికొత్త చర్చకు తెరలేపింది. అయితే... ఈ కొత్త గెటప్ ఐపీఎల్ - 2021కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలో భాగమని పలువురు చెబుతున్నారు. అభిమానులు మాత్రం ఎవరికి తోచిన సమాధానాలు వారు చెబుతున్నారు. మొత్తానికి అభిమానులు ఏం జరుగుతుందో తెలియక ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు. అసలు ఆయన ఎందుకు అలా మారారనేది తెలియాలంటే వేచి చూడక తప్పదని అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com