ధోనీ బాదుడుకు చిన్నబోయిన చిన్నస్వామి!
Send us your feedback to audioarticles@vaarta.com
ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మహేంద్ర సింగ్ ధోనీ పెద్దగా రాణించకపోవడంతో ఇక ధోనీ అయిపోయింది.. వయసు మీదికొచ్చింది కదా రిటైర్మెంట్ తీసుకుంటే మంచిది.. ఇదివరకటిలా సిక్సర్లు, ఫోర్లు ధోనీ అస్సలు కొట్టలేకపోతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
అంతేకాదు ధోనీ ఆటతీరుతో ఆయన అభిమానులు, క్రీడాభిమానులు సైతం ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. అయితే ఈ విమర్శలకు, అసంతృప్తులకు ఆదివారం నాడు చిన్నస్వామి స్టేడియం వేదికగా ధోనీ సమాధానమిచ్చారు. దీంతో విమర్శకుల చెంప చెళ్లుమనిపించినట్లైంది!.
రికార్డ్ సృష్టించిన ధోనీ..
ఆదివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. చెన్నై ముందు 162 పరుగుల ఓ మాదిరి లక్ష్యం ఉంది. స్టెయిన్, ఉమేశ్ నిప్పులు చెరిగే బంతులకు 28 పరుగులకే నాలుగు వికెట్లు ఫట్‌మన్నాయి. దీంతో మ్యాచ్ అయిపోయిందనుకుంటున్న టైమ్‌లో ధోనీ అసమాన ఇన్నింగ్స్‌తో 20వ ఓవర్‌లో 26 పరుగులు అవసరమవగా 4,6,6,2,6తో చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించాడు.
అయితే ఆఖరికి మ్యాచ్ మాత్రం తుస్సంది. ఇదిలా ఉంటే ధోనీ ఆటతీరును అందరూ మెచ్చుకుంటున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ధోనీ ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యుత్తమ స్కోరు (84) నమోదు చేసుకుని అందరి మనసులను గెలుచుకున్నారు. ధోనీ ఇప్పటి వరకూ 203 సిక్స్‌లు పూర్తి చేసుకుని.. కేవలం ఐపీఎల్‌లోనే 200 సిక్స్‌లు దాటిన తొలి భారత ఆటగాడిగా ధోనీ చరిత్ర సృష్టించాడని చెప్పుకోవచ్చు.
ప్రముఖులు ప్రశంసల వర్షం..
ధోనీ ఆటతీరును అందరూ సోషల్ మీడియా వేదికగా మెచ్చుకుంటున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ స్పందిస్తూ "భారత జట్టుకు శుభవార్త.. ప్రపంచకప్ కోసం ధోని తయారుగా ఉన్నాడు" అని కామెంట్ చేశారు. మరో మాజీ క్రికెటర్ సెహ్వాగ్ రియాక్ట్ అవుతూ.."వావ్.. ఆర్సీబీ, చెన్నై మ్యాచ్.. క్రికెట్‌లో ఓ అద్భుతమైన మ్యాచ్" అని ఆయన ట్వీట్ చేశారు. ధోనీ ఆటతీరుతో టీమ్ సభ్యులంతా ఒకింత భయపడ్డామని విరాట్ కొహ్లీ చెప్పుకొచ్చాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments