మృణాల్ సేన్ కన్నుమూత
- IndiaGlitz, [Monday,December 31 2018]
సమాంతర సినిమాకు ప్రాధాన్యత ఇచ్చిన భారత దర్శక దిగ్గజం మృణాల్ సేన్ వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో కోల్‌కత్తాలోని తన నివాసంలో కన్నుమూశారు. 1923, మే 14న ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని ఫరీదాబాద్‌లో మృణాల్ సేన్ జన్మించారు. కోల్‌కతాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే రోజుల్లో కమ్యూనిజం భావాలకు ప్రభావితుడై ఆ పార్టీ సాంస్కృతిక విభాగంలో పనిచేశారు.
ఓ ఫిలిం స్టూడియోలో ఆడియో టెక్నీషియన్‌గా పనిచేసిన ఆయన సినిమాలపై మక్కువతో 1956లో రాత్ భోరెతో దర్శకుడిగా మారారు. సమాంతర సినిమాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేశారు. 30పైగా సినిమాలను తెరకెక్కించారు. ఆయన సినిమాలకు మన దేశంలోనే కాదు.. పలు అంతర్జాతీయ వేదికల్లోనూ పురస్కారాలు దక్కాయి.
భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే సహా పలు పురస్కారాలను ఆయన అందుకున్నారు. ఆయన అంత్యక్రియలు నేడు జరుగనున్నాయి. ఈయన మృతిపై సినీ రంగంతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడి, మమతా బెనర్జీ తదితరులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.