తహసీల్దార్ హత్యకేసు: నిందితుడి భార్య ఏమందంటే..!

  • IndiaGlitz, [Wednesday,November 06 2019]

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి కేసు వ్యవహారంపై రోజుకో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తోంది. ఇప్పటికే పలు మలుపులు తిరిగిన ఈ కేసులో తాజాగా.. నిందితుడు సురేష్ భార్య లత షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేష్‌ దగ్గరున్న ఆయన సతీమణిని తొలిసారిగా మీడియా పలకరించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసలు విషయమేంటో చెప్పుకొచ్చింది. ‘నా భర్తను ఎవరో పావులా వాడుకున్నారు. నా భర్త ఇలాంటి ఘోరాలు చేసే వ్యక్తి కాదు.. చాలా అమాయకుడు. వివాదానికి సంబంధించిన భూమి విషయమే మాకు తెలియదు. నా భర్త సురేశ్ ఇటీవల కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో తిరుగుతున్నాడు. అప్పట్నుంచే సదరు భూమి విషయం తెలిసి ఉండొచ్చు. ఉన్న పొలం అమ్ముకొని అప్పులు తీర్చుకుందామనుకుంటున్న సమయంలో ఇలా జరుగుతుందని ఊహించలేదు’ అని లత కన్నీరు పెట్టుకుంది. తన భర్తకు ఎవరో నూరిపోసి ఇదంతా చేయించారని.. పూర్తి విచారణ జరిపించి ఘటన వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని ఈ సందర్భంగా లత ప్రభుత్వాన్ని కోరింది. తహసీల్దార్ విజయారెడ్డి హత్యపై సురేష్‌ భార్య లత తొలిసారిగా పెదవి విప్పి పై విధంగా చెప్పుకొచ్చింది.

More News

‘యాక్షన్‌' చిత్రంలోని ‘ఎటు నడుస్తున్నా.. ఏడ నిలుస్తున్నా... పాటకు గుడ్‌ రెస్పాన్స్‌

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా సుందర్‌ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ’యాక్షన్‌'.

విడుదలకు సిద్ధమైన 'కోనాపురంలో జరిగిన కథ'

అనిల్ మొగిలి, రేయాన్ రాహుల్, సునీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కోనాపురంలో జరిగిన కథ.

లెక్క తేల్చేస్తున్న శ్రియా శ‌ర‌న్‌

శ్రియా శ‌ర‌న్ లెక్క స‌రిచేస్తుందా? అంటే అవుననే సమాధానం విన‌ప‌డుతుంది. ఇంత‌కు శ్రియ ఏ విష‌యంలో లెక్క స‌రిచేస్తుందనే వివరాల్లోకెళ్తే..

హ్యాపీ బర్త్ డే అనుష్క శెట్టి..

అది 2005.. అప్ప‌టికే ఇండ‌స్ట్రీలో ఆర్తి అగ‌ర్వాల్, త్రిష‌, శ్రీయ లాంటి హీరోయిన్లు చ‌క్రం తిప్పుతున్నారు.

గొల్లపూడిని పరామర్శించిన ఉపరాష్ట్రపతి

టాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతిరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు.