ఎమ్మార్వో హత్యకేసు నిందితుడు సురేష్ మృతి.. వాట్ నెక్స్ట్!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి దారుణ హత్యకేసులో నిందితుడు సురేష్ మృతి చెందాడు. మూడ్రోజులుగా హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సురేష్.. కన్నుమూసినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 4న మధ్యాహ్నం ఎమ్మార్వో ఆఫీసులోనే విజయారెడ్డితో మాట్లాడాలని.. ఆమె లోనికి రమ్మన్నారని చెప్పి లోనికి ప్రవేశించి.. అనంతరం తలుపులు మూసేసిన దుండగుడు ఆమెపై ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఈ క్రమంలో నిందితుడు సురేష్‌కు మంటలు అంటుకున్నాయి. ఆమె క్షణాల్లోనే కన్నుమూసింది. మరోవైపు సురేష్ ఘటనాస్థలి నుంచి స్థానికంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. హుటాహుటిన ఆయన్ను స్థానికంగా ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ట్రీట్మెంట్ మొదలవ్వక ముందే 74 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పేలేమమన్నారు.
సుమారు 85% శరీరం గాయాలపాల్వడంతో వైద్యులు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. గురువారం నాడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా ఇప్పటికే విజయారెడ్డిని కాపాడబోయిన డ్రైవర్ గుర్నాథం కూడా మరణించాడు. మరో రెవెన్యూ ఉద్యోగి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఇదిలా ఉంటే.. రెండ్రోజుల క్రితమే అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సురేష్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. ఓ భూమికి సంబంధించి పట్టా కోసం కొంతకాలంగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. కోర్టు కేసులు, జేసీ ఆదేశాలు ఉన్నాయని తహశీల్దార్ విజయారెడ్డి సురేష్‌కు చెప్పారట. తాను ఎంత వేడుకున్నా పట్టా ఇవ్వడం కుదరదని చెప్పారని.. సోమవారం మధ్యాహ్నం వెళ్లి మరోసారి విజ్ఞప్తి చేశానన్నాడు. ఎమ్మార్వో స్పందించకపోవడంతో పెట్రోలు తనపై పోసుకొని.. తర్వాత ఆమెపై పోశానన్నాడు. తనకు నిప్పంటించుకొని ఆమెను కూడా తగులబెట్టానని చెప్పాడు. తాను కూడా చనిపోవాలని ఈ పని చేశానని చెప్పాడు.
అయితే రికార్డ్ స్టేట్మెంట్ చేసిన పోలీసులు ఈ కేసులో ఎలా ముందుకెళ్తారు..? ఏ కోణంలో విచారిస్తారో..? ఎవర్ని విచారిస్తారో..? అనేదానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు.. సురేష్ భార్య లత మాత్రం.. తన భర్తను ఎవరో పావులా వాడుకున్నారని.. తన భర్త ఇలాంటి ఘోరాలు చేసే వ్యక్తి కాదని.. చాలా అమాయకుడని చెబుతోంది. వివాదానికి సంబంధించిన భూమి విషయమే తమకు తెలియదని చెప్తోంది. మరోవైపు ఇందులో ఓ మంత్రి, కొందరు రాజకీయ నేతలు ఇన్వాల్ అయ్యారని కూడా పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమంటున్నాయ్.. మరి ఈ వ్యవహారం ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments