రూ.20 లక్షలను కాల్చేసిన తహసీల్దార్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 లక్షల రూపాయలను భార్య సాయంతో కాల్చిపడేశాడో తహసీల్దార్. తిండిలేక.. నిలువ నీడలేక ఎందరో ఇబ్బంది పడుతున్నారు కదా వారికి ఇచ్చేయవచ్చు కదా అనిపిస్తోంది. ఆ సమయంలో అంత ఆలోచన అయితే వచ్చి ఉండదు. అసలు విషయంలోకి వెళితే రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో కల్పేశ్ కుమార్ జైన్ అనే వ్యక్తి తహసీల్దార్‌గా పని చేస్తున్నారు.
ఆయన వద్ద పని చేసే పర్వత్ సింగ్ అనే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ తాజాగా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.
అధికారులు పర్వత్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, తహసీల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ చెప్పడంతోనే తానీ డబ్బులు తీసుకున్నట్టు చెప్పాడు. దీంతో అధికారులు అతడిని తీసుకుని తహసీల్దార్ కల్పేశ్ ఇంటికి బయలుదేరారు. సమాచారం అందుకున్న కల్పేశ్ వెంటనే ఇంటి తలుపులు మూసివేసి.. భార్య సహకారంతో వంట గదిలోని స్టవ్‌పై లంచంగా తీసుకున్న 20 లక్షల రూపాలయను కాల్చడం ప్రారంభించాడు. కాల్చడం పూర్తి కాక ముందే అక్కడికి ఏసీబీ అధికారులు చేరుకున్నారు.
ఇంటి లోపలి నుంచి నోట్ల కట్టలను కాలుస్తున్న వాసన రావడాన్ని గుర్తించిన ఏసీబీ అధికారులు డబ్బులు కాల్చొద్దని కల్పేశ్, అతడి భార్యను వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినిపించుకోకుండా కల్పేశ్ మొత్తం డబ్బులను కాల్చేశాడు. ఈలోపు ఎలాగోలా ఇంట్లోకి చేరుకున్న అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే రూ. 20 లక్షలను కాల్చి బూడిద చేసినట్టు గుర్తించారు. మిగిలిన రూ. 1.5 లక్షలను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com