'Mr ప్రేమికుడు' ఫస్ట్ లుక్ లాంచ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభుదేవా, అదాశర్మ, నిక్కగల్రాని హీరో హీరోయిన్లుగా శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'చార్లీ చాప్లిన్'. ఈ చిత్రాన్ని శ్రీ తారకరామ పిక్చర్స్ పతాకంపై ఎమ్ .వి. కృష్ణ సమర్పణలో వి.శ్రీనివాసరావు తెలుగులో కి 'మిస్టర్ ప్రేమికుడు' పేరుతో అనువదిస్తున్నారు.
తమిళంలో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రం అక్కడ భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం తెలుగు అనువాద కార్యక్రమాలు ఫైనల్ దశలో ఉన్నాయి. ఈ నెలలోనే సినిమాను గ్రాండ్ గా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ..."ప్రభుదేవా హీరోగా నటించిన సినిమాలంటే అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం. అందుకే తెలుగులోకి అనువదిస్తున్నాం. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలోని పాటలతో పాటు సెకండాఫ్ లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయి. త్వరలో ఆడియో విడుదల చేసిన ఈ నెలలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.
ఈ చిత్రానికి సంగీతంః అమ్రీష్; స్టంట్స్ః కనల్ కన్నన్; సినిమాటోగ్రాఫర్ః సౌందర్ రాజన్; సమర్పణః ఎమ్.వి.కృష్ణ; కో-ప్రొడ్యూసర్స్ః మహేష్ చౌదరి గుర్రం, శంకరరావు సారికి; నిర్మాతః వి.శ్రీనివాసరావు; దర్శకత్వంః శక్తి చిదంబరం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments