విక్రమ్‌కి గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. తాజాగా ఆయన ఇంటర్నేషనల్ క్రిమినల్‌గా నటించిన చిత్రం కెకె. కమల్‌హాసన్ ఈ సినిమాను నిర్మించారు. ఆయన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌లో విక్రమ్‌ను కథానాయకుడిగా పెట్టి సినిమా చేశారనగానే సినిమాపై అంచనాలు పెరిగాయి. దానికి తోడు ఆయన తనయ అక్షర హాసన్ ఇందులో గర్భవతిగా నటించింది అనగానే వినడానికి ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. మలేషియా చుట్టూ తిరిగే ఈ కథ విక్రమ్‌కు ఇండియాలో పేరు తెచ్చిపెడుతుందా? ఆయన కెరీర్‌లో ఎంతగానో ఎదురుచూస్తున్న హిట్‌ను అందిస్తుందా... ఆలస్యమెందుకు జస్ట్ గో త్రూ...
కథ:
కెకె (విక్రమ్) క్రిమినల్. కానీ అతడు కమాండోగా శిక్షణ పొంది ఉంటాడు. అయినా అతనిపై ఆర్మ్స్ కొల్లడంతంతో పాటు చాలా కేసులుంటాయి. కానీ ఏవీ ప్రూవ్ కావు. కౌలాలంపూర్‌లో జరిగిన ఓ మర్డర్ కేసులో అతను సస్పిక్ట్. అతన్ని పట్టుకోవడానికి ఇద్దరు తరుముతుండగా గాయపడతాడు. అతన్ని ఆసుప్రతికి తీసుకెళ్తారు. అక్కడ కూడా అతనిపై అటాక్ జరుగుతుంది. ఓ ట్రైనీ డాక్టర్ వాసు (అభి హాసన్) అతని ప్రాణాలు కాపాడుతాడు. మరోవైపు వెంటనే ట్రైనీ డాక్టర్ కుటుంబంపై అటాక్ జరుగుతుంది. అతని భార్య అదీరా (అక్షరా హాసన్)ను కిడ్నాప్ చేస్తారు. కెకెను అప్పగిస్తేనే అదీరాను అప్పగిస్తామని అంటారు. కౌలాలంపూర్‌లో జరిగిన మర్డర్ కేసులు విన్సెంట్ (వికాస్), కల్పన (లీనా) టీమ్‌లు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాయి. ఓ సందర్భంలో వాసు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా కల్పన స్పాట్‌కు వెళ్తుంది. అక్కడికి వచ్చిన విన్సెంట్ ఆమెను చంపేస్తాడు. ఇంతకీ విన్సెంట్ మంచివాడా కాదా? ఒకవేళ చెడ్డవాడే అయితే అతను ఉమర్ అహ్మద్‌కు, అమల్‌దాస్ డేవిడ్‌కు చేసిన సాయం ఏంటి? కేకేకు చేసిన అన్యాయం ఏంటి? అదీరాను కాపాడటానికి ప్రాణాలు సైతం పణంగా పెట్టిన నంద (సిద్ధార్థ) ఎవరు? అతనికి కేకేకి సంబంధం ఏంటి? చివరికి వాసుకు కెకె సాయం చేశాడా? అదీరాను వాసు చేరుకోగలిగాడా? అదీరా కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటి? వంటివన్నీ ఆసక్తికరం.
సమీక్ష:
ఓ ఇంటర్నేషనల్ డాన్. అతను అన్నిట్లోనూ సుశిక్షితుడు. అయినా చేసేది ఇల్లీగల్ పనులు. అతను పనులు చెడ్డవే. కానీ మనసు మంచిది. అతను పెద్దవారిని కొడతాడు. చిన్నవారి జోలికి పోడు... ఈ కాన్సెప్ట్ తో అంతర్జాతీయ స్టాండర్డ్స్ తో చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా వచ్చిన తమిళ సినిమా `కడారమ్ కొండాన్ ` తెలుగులో కేకే అలాంటిదే. విక్రమ్ ఇందులో గ్రేటెస్ట్ క్రిమినల్. తను చేసిన తప్పులు కూడా ఎక్కడా పోలీసులకు దొరకనంతగా చేయదగ్గ క్రిమినల్. అలాంటి వ్యక్తి కేసులో అనుకోకుండా ఓ యువ జంట ఇరుక్కుంటారు. అతను డాక్టర్. అమ్మాయి ప్రెగ్నెంట్. ఇద్దరూ రెండు మతాలకు చెందిన వారు. ఇంటినుంచి కూడా వారికి సపోర్ట్ ఉండదు. ఇలాంటి నేపథ్యంలో అమాయకంగా ఈ కేసులోకి వెళ్లిన జంట కథ ఇది. కెకెగా విక్రమ్ నటించారు. సినిమా మొదటి నుంచీ, చివరివరకు ఎక్కడో చూసినట్టే ఉంటుంది. మలేషియాలో కార్ ఛేజ్‌లు మనవారికి కొత్తకాదు. బైక్ ఛేజ్‌లు కూడా కొత్తేం కాదు. ప్రొఫెషనల్ జెలసీ, చేస్తున్న పని మీద గౌరవం లేకుండా, డబ్బుకు ఆశపడి ఇతరులకు పనిచేసే పోలీసులు ఇలాంటివీ కొత్తకాదు. అమాయకుల్ని ఏమీ అనకుండా, వారికి వీలైనంత సాయం చేసే డాన్‌లు కూడా మనకేమీ కొత్తకాదు. ఈ సినిమాలో మళ్లీ మళ్లీ చూపించినవి అవే. కాకపోతే ఆఖరిన అక్షరాహాసన్ చేసిన పోరాటం బావుంది. తను ప్రెగ్నెంట్ అని అవతలివారు ఏదో చేయబోతే బేలగా ఊరుకోకుండా తన శక్తి మేరకు ప్రతిఘటించిన తీరు బావుంది. వాసు అమాయకుడని నిరూపించడానికి కెకె అతని సెల్లుకు పెన్ డ్రైవ్ పెట్టడం కూడా బావుంది. అక్కడక్కడా చమక్కులనిపించే విషయాలున్నాయి. అయితే ఎక్కడా హాస్యం లేదు. పాట ఉన్నప్పటికీ, అదేదో కెకె ను పొగుడుతూ అతన్ని వీరుడూ శూరుడూ అని ఎలివేట్ చేయడానికే ఉన్నట్టు అనిపిస్తుంది. రీరికార్డింగ్ కూడా సౌండ్ ఎక్కువగా ఉంది. అక్షరాహాసన్ చేసిన ఏవో ఒకట్రెండు సన్నివేశాల్లో తప్ప ఎమోషన్ కూడా పెద్దగా పండలేదు. వాసు పాత్రలో అభి, అదీరా పాత్రలో అక్షర, కెకెగా విక్రమ్ తమ పనులు బాగా చేశారు. కెమెరాపనితనం బావుంది. టెక్నికల్‌గా సినిమా బావుంది. అందులో కాస్త సోల్ కూడా మిక్స్ అయి ఉంటే బావుండేది.
బాటమ్ లైన్: టెక్నికల్ `కెకె`
Comments