close
Choose your channels

ప్రజలు తుపుక్కున ఉమ్మిన సంగతి మరిచారా!?

Wednesday, August 28, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రజలు తుపుక్కున ఉమ్మిన సంగతి మరిచారా!?

పసలేని విమర్శలు చేసి పరువు తీసుకోవద్దని.. వైసీపీ సర్కార్‌పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలపై ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి హితవు పలికారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై.. టీడీపీ సీనియర్‌ నేత, ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. జగన్‌పై అర్థంపర్థంలేని విమర్శలు చేస్తున్నారని.. ఎన్నికలకు ముందు ఇలాంటి చౌకబారు విమర్శలు చేసే ప్రతిపక్షానికి పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.

ఏమైంది యనమలగారూ..!?

"ఏమైంది యనమల గారూ? తెలంగాణ లబ్ది కోసం జగన్‌ గారు రాష్ట్రాభివృద్ధికి గండికొడుతున్నారా? ఆర్ధిక మంత్రిగా రాష్ట్రాన్ని20 ఏళ్లు వెనక్కు నెట్టిన ఘనులు మీరు. ఎన్నికల ముందు కూడా ఇలాగే కేసీఆర్, మోదీలతో చేతులు కలిపామని ఆరోపణలు చేస్తే ప్రజలు మీపై తుపుక్కున ఉమ్మిన సంగతి మరిచారా?''అని విజయసాయి ఎద్దేవా చేశారు. అయితే విజయసాయి హాట్ హాట్ ట్వీట్‌పై టీడీపీ నేతలు, ముఖ్యంగా యనమల ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment