కాంగ్రెస్‌కు టాటా చెప్పి కారెక్కనున్న సబితా.. ఎంపీ టికెట్ ఫిక్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగలడంతో.. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించాలని అధిష్టానం సమాయత్తమవుతోంది. అయితే లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. కాంగ్రెస్ టాటా చెప్పి కారెక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. శనివారం శంషాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభ అనంతరం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సచితా భేటీ అయినట్లు సమాచారం.
ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. సబితా చేరికలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోది. సబితా కుటుంబానికి- ఓవైసీకి ఫ్యామిలీకి మంచి సన్నిహిత సంబంధాలున్న విషయం విదితమే. అందుకే సబితను టీఆర్ఎస్ చేర్చడానికి మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. ఆదివారం ఉదయం.. ఒవైసీ ఇంట్లోనే కేటీఆర్-సబిత భేటీ అయ్యారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. సబితా, ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డితో పాటు ప్రధాన అనుచరులంతా టీఆర్‌ఎస్ కండువా కప్పుకోవడం ఖాయమని తెలుస్తోంది. కాగా.. మూడ్రోజుల క్రితం ఈ చేరిక వ్యవహారం గురించి అసద్- కార్తిక్ రెడ్డి చర్చించుకున్నారని వార్తలు వినవస్తున్నాయి.
కార్తిక్ రెడ్డికి ఎంపీ టికెట్ ఫిక్స్..!
సబితా టీఆర్ఎస్‌లో చేరితే ఎంపీ టికెట్ ఇస్తామని.. ఆయన్ను గెలిపించుకొని తీసుకొస్తే.. సబితకు మంత్రి పదవి ఇస్తామని కేటీఆర్ కండిషన్ పెట్టారని తెలుస్తోంది. కాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో కుమారుడికి టికెట్ దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేయాలని సబితా భావించినప్పటికీ అదే అసంతృప్తితోనే మహేశ్వరం నుంచి పోటీచేసి గెలుపొందారు. అయితే రాష్ట్రంలో పార్టీకి అంతంత మాత్రమే పరిస్థితులు ఉండటంతో కుమారుడి భవిష్యత్తు కోసం ఆమె టీఆర్ఎస్‌లో చేరాలని భావిస్తున్నారట. అందుకే అసెంబ్లీలో ఒకానొక సందర్భంలో మహిళలకు మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అని పరోక్షంగా సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం సబితాతో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరతారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవన్నీ ఒట్టి పుకార్లేనని వాటన్నింటికీ సబితా ఫుల్‌స్టాప్ పెట్టారు. అయితే తాజాగా.. ఆదివారం ఉదయం నుంచి మీడియాలో కథనాలు, స్క్రోలింగ్స్ వస్తున్నప్పటికీ ఆమె ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈసారి కారెక్కడం పక్కా అని తెలుస్తోంది. సో ఈ వ్యవహారంపై క్లారిటీ రావాలంటే మరో రెండ్రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout