టీడీపీలో కాదు.. బీజేపీలోనే ఉన్నా..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంతో.. పలువురు టీడీపీ ఎంపీలు ‘సైకిల్’ దిగి.. కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే పార్టీ మారారే తప్ప వాళ్ల చేసే పనులన్నీ తెలుగుదేశం తరఫునే చేస్తున్నారని.. సీబీఐ, సీఐడీ దాడుల నుంచి తప్పించుకోవడానికి పార్టీ మారారని అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదివరకే టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ పలు సంరదర్భాల్లో నాలుక కరుచుకున్నారు. అయితే తాజాగా.. రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ మీడియా మాట్లాడుతూ ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్పేశారు. మొత్తమ్మీద ఈ కన్ఫూజన్‌తో రచ్చరచ్చే జరిగింది.
అసలేం జరిగింది!
సోమవారం నాడు ఢిల్లీ మీడియా మీట్ నిర్వహించిన టీజీ.. ‘మా తెలుగుదేశం పార్టీ నేతలు..’ అని నోరు జారారు. అయితే సార్.. సార్ మీరిప్పుడు టీడీపీనా.. బీజేపీనా..? అని ప్రశ్నించగా.. సారీ తెలుగుదేశం కాదు.. తెలుగు ప్రజలు అంటూ తన మాటను సర్దుకునే ప్రయత్నం చేశారు. అంటే తెలుగుదేశంలో కాదు బాబోయ్.. బీజేపీలో ఉన్నానని చెప్పుకునే ప్రయత్నం చేశారన్న మాట. అయితే అప్పటికే గందరగోళం నెలకొనడంతో చేసేదమీ లేక.. మళ్లీ మీడియాతో మాట్లాడటం ప్రెష్‌గా ప్రారంభించారు.
నాది రాయలసీమ!
‘రాజధాని అమరావతి పెద్ద వివాదంగా మారింది. రాజధానిగా అమరావతి పనికి రాదంటూనే మూడు రాజధానుల్లో ఒకటిగా దీనిని చెబుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ సబబుగానే ఉంది కానీ, మూడు ముక్కలుగా పాలన చేయవద్దు. నాది రాయలసీమ, నా మామది అమరావతి, నా బిడ్డనిచ్చింది విశాఖపట్నం’ అందుకే అందరి కోసం మూడు రాజధానులుండాలని కోరుకుంటున్నాను. ఎక్కడైనా ఒకచోటే రాజధాని ఏర్పాటు చేయాలి. మూడు ప్రాంతాల్లో హైకోర్టు, అసెంబ్లీ, మినీ సచివాలయం ఉండేలా చూడాలి’ అని జగన్ సర్కార్‌కు టీజీ సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments