సీబీఐ ఎఫ్‌ఆర్‌ఐపై స్పందించిన రఘురామ

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై సీబీఐ ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా రఘురామ కృష్ణరాజు వివరణ ఇచ్చారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..

అభూతకల్పనలు, అవాస్తవాలతో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసిందన్నారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ వెనుక మా పార్టీ నేతల ఒత్తిడి ఉందన్నారు. ఇంకా రఘురామ మాట్లాడుతూ.. ‘‘ఫిర్యాదు చేసిన ఎస్‌బీఐ మేనేజర్‌కు, సీఎంవో మధ్య.. ఫోన్‌ కాల్స్‌పై విచారణ జరిపించాలి. పలు ఛార్జిషీట్‌లు దాఖలైన సీఎం జగన్‌.. విచారణకు హాజరుకాకపోయినా సీబీఐ పట్టించుకోలేదు. ఎన్‌పీఎల్టీలో ఉన్న నా కంపెనీపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలుకు ఆస్కారం లేదు. నిధుల మళ్లింపు, దుర్వినియోగం ఆరోపణల్లో నిజం లేదు. నిజాలన్నీ నిలకడ మీద తెలుస్తాయి, సీబీఐ విచారణకు సహకరిస్తా’’ అని వెల్లడించారు.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఎస్‌బీఐ చెన్నై బ్రాంచ్‌ డిప్యూటీ జనరల్ మేనేజర్‌ రవిచంద్రన్ ఫిర్యాదు మేరకు ఆయనపై ఫోర్జరీ కేసు నమోదైంది. ఇండ్ భారత్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ కోసం రఘురామకృష్ణంరాజు ఫోర్జరీ పత్రాలతో బ్యాంకులను మోసం చేశారని.. 273.84 కోట్లు రుణం తీసుకుని ఎగవేశారని రవిచంద్రన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో బ్యాంకును మోసం చేసి నిధులను దారి మళ్లించినట్టు మేనేజర్‌ రవిచంద్రన్‌ వెల్లడించారు.

ఈ నెల 23న సీబీఐకి రవిచంద్రన్ ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు సహా మరో 9 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇండ్ భారత్ పవర్ జెన్‌కమ్ లిమిటెడ్ సంస్థతో పాటు డైరెక్టర్ రఘు రామకృష్ణ రాజు, ఇతర డైరెక్టర్లు కనుమూరు రమాదేవి, రాజ్ కుమార్ గంటా, దుంపల మధు సూదన రెడ్డి, నారాయణ ప్రసాద్ భాగవతుల, రామచంద్ర అయ్యర్‌లపై కేసు నమోదైంది. ఐపీసీలోని 120 బీ రెడ్‌విత్ 420, 468, 471తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్‌విత్ 13(1)(డీ) కింది అభియోగాలు మోపింది.

More News

అసెంబ్లీలో నవ్వులు పూయించిన మంత్రి మల్లారెడ్డి

ప్రతీచోట సరదాగా మాట్లాడుతూ నవ్వించే వారు ఉంటూనే ఉంటారు. సీరియస్‌గా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీలో మంత్రి చామకూర మల్లారెడ్డి నవ్వుల పువ్వులు పూయించారు.

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ పేరు.. స్పందించిన చిరు

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు పెట్టిన విషయం తెలిసిందే. నేడు కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును సీఎం జగన్ ప్రారంభించారు.

న‌న్ను మించి 'రంగ్ దే' క‌థ‌ను నితిన్‌, కీర్తి సురేష్ ఎక్కువ‌గా న‌మ్మారు - డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి

'తొలిప్రేమ'‌, 'మిస్ట‌ర్ మ‌జ్ను' చిత్రాల త‌ర్వాత వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూడో చిత్రం 'రంగ్ దే'.

డా. రాజశేఖర్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో 'మర్మాణువు'

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా పెగాసస్ సినీ కార్ప్ ఎల్ఎల్‌పి, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి.