MP Navneet Kaur:మంత్రి రోజాకు మద్దతుగా ఎంపీ నవనీత్ కౌర్.. బండారు వ్యాఖ్యలపై మండిపాటు
Send us your feedback to audioarticles@vaarta.com
మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే మాజీ సీనియర్ నటి కవిత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్భూ, మరో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్.. రోజాకు మద్దతుగా బండారు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ హీరోయిన్, మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణా రోజాకు అండగా నిలిచారు.
మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా..?
"అందరికీ నమస్కారం. ఈరోజు ఒక్క వీడియో చూశాను. అందులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ రోజా గారి పట్ల చేసిన వ్యాఖ్యలు చూసి ఆశ్చర్యపోయాను. రోజా గారు ఒకప్పుడు హీరోయిన్గా పనిచేశారు. పెద్ద పెద్ద హీరోలతో నటించారు. ఇప్పుడు రాజకీయాల్లో మంత్రిగా పనిచేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్న మహిళల పట్ల ఇలాంటి కామెంట్స్ చేయడానికి ఎంత ధైర్యం కావాలి. మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా? రాజకీయాల్లో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మీరు ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేయడం దారుణం. తెలుగు రాష్ట్రాల్లో మహిళల్ని చాలా గౌరవిస్తారు. కానీ బండారు వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయి. మీకు అసలు సిగ్గులేదా..? తక్షణమే రోజాకు క్షమాపణలు చెప్పాలి. రోజా గారు మీకు దేశంలోని మహిళలందరూ అండగా ఉంటారు" అని నవనీత్ కౌర్ ఓ వీడియో విడుదల చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments